Rashmika Mandanna: రష్మిక ఆశలు గల్లంతు... ఖాతాలో మరో ప్లాప్!

Published : Jan 21, 2023, 03:11 PM ISTUpdated : Jan 21, 2023, 03:22 PM IST
Rashmika Mandanna: రష్మిక ఆశలు గల్లంతు... ఖాతాలో మరో ప్లాప్!

సారాంశం

బాలీవుడ్ లో పాగా వేద్దామన్న రష్మిక మందాన ఆశలు గల్లంతయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ ఆమెకు షాక్ ఇస్తున్నాయి.   

సౌత్ పరిశ్రమలతో రష్మిక మందానకు పొసగడం లేదు. ఆమె కామెంట్స్ వ్యతిరేకతకు కారణం అవుతున్నాయి. ఆల్రెడీ కన్నడ పరిశ్రమతో విభేదాలు కొనసాగుతున్నాయి. రష్మిక ఇంతవరకు కర్ణాటకలో అడుగుపెట్టలేదని సమాచారం. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టితో ఆమెకు కోల్డ్ వార్ నడుస్తుంది. సౌత్ ఇండియా మొత్తం ఆమె మీద గుర్రుగానే ఉంది. ఆ మధ్య సౌత్ చిత్రాల మ్యూజిక్ అంతా డప్పుల దరువు. రొమాంటిక్, ఫీల్ గుడ్ మ్యూజిక్ అంటే తెలియదని అనుచిత కామెంట్స్ చేశారు. 

ఇలాంటి వ్యాఖ్యల ద్వారా రష్మిక నార్త్ ఆడియన్స్ ని బుట్టలో వేసుకోవాలి అనుకుంటున్నారు. అయితే సక్సెస్ మాత్రమే ఎక్కడైనా పనిచేస్తుంది. సౌత్ ని కించపరిచినంత మాత్రాన నార్త్ ఆడియన్స్ ఆదరించరు. ఇక బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్న రష్మిక ఆశలు గల్లంతయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమెకు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ పడుతున్నాయి. రష్మిక లేటెస్ట్ మూవీ మిషన్ మజ్ను నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. 

సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా దర్శకుడు శాంతను బాఘ్చి తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో పోలికలు పెడుతూ మూవీలో విషయం లేదని తేల్చేశారు. అందులోనూ మిషన్ మజ్ను నేరుగా ఓటీటీలో విడుదలైంది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న మిషన్ మజ్ను చిత్రం పట్ల ప్రేక్షకులు పెదవి విరిచారు. దీంతో రష్మిక నిరాశలో కూరుకుపోయింది. గత ఏడాది ఆమె నటించిన హిందీ చిత్రం గుడ్ బై సైతం ఇదే రిజల్ట్ అందుకుంటుంది. అమితాబ్ కీలక రోల్ చేసిన గుడ్ బై ని హిందీ ప్రేక్షకులు పట్టించుకోలేదు. 

ఇక రష్మిక ఆశలన్నీ యానిమల్ చిత్రం మీదే. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీ తెరకెక్కిస్తున్న నేపథ్యంలో భారీ అంచనాలున్నాయి. రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. బాలీవుడ్ లో రష్మిక నిలదొక్కుకోవాలంటే ఈ మూవీ విజయం సాధించాలి. కాగా సంక్రాంతి కానుకగా విడుదలైన వారసుడు మూవీలో రష్మిక హీరో విజయ్ తో జతకట్టారు. పుష్ప 2 లో అల్లు అర్జున్ కి జంటగా నటిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jananayagan Censor: సీఎం విజయ్ జననాయగన్ కు సెన్సార్ పూర్తయ్యిందా? A సర్టిఫికెట్ వార్తల్లో నిజమెంత?
Aryan Rajesh: అల్లరి నరేష్‌ బ్రదర్‌ ఆర్యన్‌ రాజేష్‌ కమ్ బ్యాక్.. గ్రాండ్‌గా సినిమా స్టార్ట్.. అసలు ట్విస్ట్ ఇదే