లైంగిక వేధింపులు, రైలు నుంచి తోసి చంపే ప్రయత్నం.. నటుడిపై అంజలి నాయర్ సంచలన ఆరోపణలు

Published : Feb 19, 2023, 02:51 PM IST
లైంగిక వేధింపులు, రైలు నుంచి తోసి చంపే ప్రయత్నం.. నటుడిపై అంజలి నాయర్ సంచలన ఆరోపణలు

సారాంశం

ప్రముఖ నటి అంజలి నాయర్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ సంచలనంగా మారాయి. అంజలి నాయర్ రజనీకాంత్ అన్నాత్తే, విజయ్ సేతుపతి మామనిదన్ లాంటి చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకుంది.

ప్రముఖ నటి అంజలి నాయర్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ సంచలనంగా మారాయి. అంజలి నాయర్ రజనీకాంత్ అన్నాత్తే, విజయ్ సేతుపతి మామనిదన్ లాంటి చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకుంది. అనేక మలయాళీ, తమిళ చిత్రాల్లో అంజలి నాయర్ నటించింది. 

చిత్ర పరిశ్రమలో నటీమణులకు వేధింపులు, కాస్టింగ్ కౌచ్ సంఘటనలు ఎదురుకావడం చూస్తూనే ఉన్నాము. అంజలి నాయర్ కూడా ఓ నటుడి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు తాజాగా ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఆమె చేసిన కామెంట్స్ షాకిచ్చేలా ఉన్నాయి. 

తాను మలయాళీ అయినప్పటికీ తమిళం కూడా బాగా వచ్చట. దీనితో కెరీర్ ఆరంభంలోనే తమిళ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపాను. అవకాశాలు కూడా వచ్చాయి. నేను నటించిన తొలి తమిళ చిత్రంతోనే నాకు వేధింపులు ఎదురయ్యాయి. ఆ చిత్రంలో విలన్ పాత్రలో నటించిన వ్యక్తి ఎన్నో విధాలుగా నన్ను ఇబ్బంది పెట్టాడు. 

ఆ చిత్రానికి అతడు కో ప్రొడ్యూసర్ కూడా. దీనితో షూటింగ్ అయ్యాక కూడా నన్ను సెట్స్ నుంచి వెళ్లనిచ్చేవాడు కాదు. అసభ్యంగా ప్రవర్తించేవాడు. ప్రేమ పేరుతో నా వెంట పడేవాడు. అతడి వేధింపులు భరించలేక ఒక సందర్భంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు అంజలి నాయర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

ఒక సారు నన్ను రైలు లో నుంచి తోసి చంపేందుకు కూడా ప్రయత్నిచాడు అంటూ ప్రకంపనలు రేపింది. ఆ నటుడి పేరు చెప్పేందుకు ఇష్టపడలేదు. దీనితో అంజలి నాయర్ గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు. అంజలి నాయర్ 2011లో అనీష్ అనే ఫిల్మ్ మేకర్ ని వివాహం చేసుకుంది. అతడి నుంచి విడిపోయి అజిత్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్
Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?