ఆరు నెలలు, మూడు పాన్ ఇండియా చిత్రాలు.. ప్రభాస్‌ ఫ్యాన్స్ కి పండగే పండగ..

Published : Feb 19, 2023, 02:02 PM ISTUpdated : Feb 19, 2023, 04:46 PM IST
ఆరు నెలలు, మూడు పాన్ ఇండియా చిత్రాలు.. ప్రభాస్‌ ఫ్యాన్స్ కి పండగే పండగ..

సారాంశం

ప్రభాస్‌ ఫ్యాన్స్ కి సినిమాల జాతర ప్రారంభం కానుంది. వరుసగా డార్లింగ్‌ సినిమాలు గ్యాప్‌ లేకుండా రిలీజ్‌ కాబోతున్నాయి. దీంతో సంబరాలు స్టార్ట్ చేశారు అభిమానులు.

ప్రభాస్‌ వెండితెరపై మెరిసి ఆల్మోస్ట్ ఏడాది కావస్తుంది. చివరగా ఆయన `రాధేశ్యామ్‌` చిత్రంలో నటించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. పీరియాడికల్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా, ఆస్ట్రాలజీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్‌ ఫామిస్ట్ గా కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. నిర్మాతలకు భారీ నష్టాలను కలగచేసింది. 

`బాహుబలి2` తర్వాత ప్రభాస్‌ ఫ్యాన్స్ ని ఖుషీ చేసే సినిమా పడలేదు. డార్లింగ్‌ తన సత్తాని చూపించే హిట్‌ రాలేదు. `సాహో` యావరేజ్‌గానే మెప్పించింది. దీంతో సక్సెస్‌ కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ నాలుగు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. మారుతి సినిమా పక్కన పెడితే మిగిలిన మూడు పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నాయి. ఇండియా దాటి ఈ సినిమాలపై అంచనాలు నెలకొన్నాయి. 

వాటిలో ఓం రౌత్‌ రూపొందించే `ఆదిపురుష్‌`, ప్రశాంత్‌ నీల్‌ `సలార్‌`, నాగ్‌ అశ్విన్‌ `ప్రాజెక్ట్ కే` చిత్రాలున్నాయి. అయితే ఇప్పుడు ఈ మూడు సినిమాల రిలీజ్‌ డేట్‌లు ప్రకటించారు మేకర్స్. ఆరు నెలల్లో మూడు భారీ చిత్రాలతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు పాన్‌ ఇండియా స్టార్. మూడు భారీ సినిమాలు కావడంతో ఇక ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. `ఆదిపురుష్‌` జూన్‌ 16న రిలీజ్‌ చేయబోతున్నారు. సెప్టెంబర్‌ 28న `సలార్‌`ని, వచ్చే సంక్రాంతికి జనవరి 12న `ప్రాజెక్ట్ కే`ని రిలీజ్‌ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆరు నెలల గ్యాప్‌లో మూడు సినిమాలతో ఫ్యాన్స్ ని అలరించబోతున్నారు ప్రభాస్‌. 

అంతేకాదు దీనికి మారుతి సినిమా బోనస్‌గా రాబోతుంది. ఈ సినిమా కూడా వచ్చే సమ్మర్‌లో రానుందట. అంటే పది నెలల గ్యాప్‌లోనే ఆయన నాలుగు సినిమాలతో అటు ఇండియన్‌ ఆడియెన్స్, ఇటు ఫ్యాన్స్‌ ని ఎంటర్‌టైన్‌ చేయబోతున్నారు డార్లింగ్. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు అప్‌డేట్ల కోసం వేచి చూసి వేసారి పోయిన అభిమానులు ఇలా ఒకేసారి సినిమా పండగ తీసుకురాబోతున్న నేపథ్యంలో ఫుల్‌ హ్యాపీగా ఫీలవుతున్నారు. సందడంతా తమదే అంటూ సంబరాలు స్టార్ట్ చేశారు ప్రభాస్‌ అభిమానులు. 

ప్రభాస్‌ నటిస్తున్న నాలుగు నాలుగు విభిన్న సినిమాలు కావడం విశేషం. `ఆదిపురుష్‌` రామాయణం ఆధారంగా విజువల్‌ వండర్‌గా రూపొందుతుంది. ఇందులో రాముడిగా ప్రభాస్‌ కనిపిస్తారు. ఇక `సలార్‌` సింగరేణి నేపథ్యంలో కార్మిక నాయకుడిగా డార్లింగ్‌ కనిపిస్తారు. ఇది మాస్‌ యాక్షన్‌ మూవీగా రానుంది. ఇంకోవైపు `ప్రాజెక్ట్ కే` సైన్స్ ఫిక్షన్‌. సూపర్‌ హీరో నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇందులో యుద్ధ వీరుడిగా సూపర్‌ హీరో తరహా పాత్రలో కనిపించబోతున్నారు. మరోవైపు మారుతితో పూర్తి కమర్షియల్‌ మూవీ చేస్తున్నారు. ఇందులో అసలు ప్రభాస్‌ కనిపించబోతున్నారని చెప్పొచ్చు. మారుతి తాలుకూ వినోదం ఉండబోతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ