హీరో రామ్ ఖాతాలో అరుదైన రికార్డ్, బాలీవుడ్ లో రేర్ ఫీట్ సాధించిన యంగ్ హీరో

Published : Feb 19, 2023, 02:23 PM IST
హీరో రామ్ ఖాతాలో అరుదైన రికార్డ్,  బాలీవుడ్ లో రేర్ ఫీట్ సాధించిన యంగ్ హీరో

సారాంశం

కొత్త సినిమా రిలీజ్ కాలేదు... రిలీజ్ అయిన సినిమాలు ఆడలేదు.. అయినా సరే రేర్ రికార్డ్ సాధించాడు టాలీవుడ్ యంగ్ హీరో  రామ్ పోతినేని. ఇంతకీ ఆయన సాధించిన రికార్డ్ ఏంటంటే..?   

కొత్త సినిమా రిలీజ్ కాలేదు... రిలీజ్ అయిన సినిమాలు ఆడలేదు.. అయినా సరే రేర్ రికార్డ్ సాధించాడు టాలీవుడ్ యంగ్ హీరో  రామ్ పోతినేని. ఇంతకీ ఆయన సాధించిన రికార్డ్ ఏంటంటే..? 

ఈమధ్య హీరోల సినిమాలు రిలీజ్ అవ్వాల్సిన అవసరంలేదు. ఏ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయకుండానే రికార్డ్స్ సాధించవచ్చు. ఈ మధ్య ఇది నిరూపించి చూపిస్తున్నారు టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలు. అది కూడా బాలీవుడ్ లో  విజయ్ దేవరకోండతో స్టార్ట్ అయిన రికార్డ్ ల పరంపర.. రామ్ దగ్గరకు వచ్చి చేరింది. ఇంతకీ రామ్ సాధించిన రికార్డ్ ఏంటంటే.. ? 

బాలీవుడ్  లో మన హీరోలకు డిమాండ్ పెరిగిపోతోంది. మన హీరోల సినిమాలు రిలీజ్ అయినా కాకపోయినా..మన సినిమాలు డబ్బింగ్ అవ్వగానే యూట్యూబ్ లో తెగ చూసేస్తున్నారు. ఈక్రమంలోనే రామ్ పోతినేని హలో గురు ప్రేమ కోసమే హిందీ డబ్బింగ్ మూవీ ఏకంగా 500 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. రామ్ నటించిన అన్ని సినిమాల హిందీ వ్యూస్ 2 బిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి. ఈరకంగా బాలీవుడ్ లో రేర్ రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు రామ్. 

వరుస ఫెయిల్యూర్స్ తో బాధపడుతన్నాడు రామ్. మాస్ ఇమేజ్ కోసం తారాడుతున్న రామ్.. ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హీరోగా తన సత్తాను  చాటుకున్న రామ్.. ఆతరువా  ఆపేరు స్థిరం చేసుకోవడం కోసం చాలా కష్టాలు పడుతున్నారు. అప్పటి నుంచి మాస్ స్టోరీస్ తో రెడ్, వారియర్ లాంటి సినిమాలు చేశాడు. కాని ఈరెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో తన మాస్ హీరో ఇమేజ్ కలను కలగానే మిగిలిపోయింది. ఇక ఇప్పుడు చివరి ప్రయత్నంగా బోయపాటికి ఛాన్స్ ఇచ్చాడు రామ్. 

బోయపాటి అయినా.. తనను మాస్ హీరోగా నిలబెడతాడని నమ్మకంతో ఉన్నాడు. మరి ఈసారి రామ్ ఆశలు తిరుతాయా లేదా చూడాలి. బోయపాటి మాత్రం ఊరమాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. కాకపోతే.. అదే మాస్ కంటెంట్ తో ఎన్టీఆర్ లాంటి వారికి  కూడా డిజాస్టర్స్ ఇచ్చాడు బోయపాటి. మరి రామ్ కు హిట్ ఇస్తాడా.. ? లేదా చూడాలి. 

ఇక పోతే.. బాలీవుడ్ డబ్బింగ్ సినిమాల రికార్డ్ ల విషయంలో రామ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.  సౌత్ లో నితిన్ పేరిట 2.3 బిలియన్ వ్యూస్ తో హిందీ వెర్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించిన రికార్డ్ ఉండగా.. హీరో రామ్ ఆ తర్వాత స్థానంలో ఉన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్
Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?