అనిరుధ్ తాత, దర్శకుడు ఎస్వీ రమణన్ కన్నుమూత

By team teluguFirst Published Sep 27, 2022, 7:59 AM IST
Highlights

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. రేడియో డబ్బింగ్ ఆర్టిస్ట్, దర్శకుడు ఎస్వీ రమణన్(87) తుదిశ్వాస విడిచారు. రమణన్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. 

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. రేడియో డబ్బింగ్ ఆర్టిస్ట్, దర్శకుడు ఎస్వీ రమణన్(87) తుదిశ్వాస విడిచారు. రమణన్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం 1930, 1940లలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. 

రేడియోలో రమణన్ వేలాది కార్యక్రమాలకు డబ్బింగ్ చెప్పారు. దర్శకుడిగా లఘు చిత్రాలు రూపొందించారు. భక్తిరస డాక్యుమెంటరీలు చిత్రీకరించారు. వయసు భారం, అనారోగ్యాల కారణంగా రమణన్  సోమవారం మరణించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 

1983లో రమణన్.. మహేంద్రన్, సుహాసిని ప్రధాన పాత్రల్లో ఊరువంగల్ మరాళం అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ గెస్ట్ రోల్స్ ప్లే చేయడం విశేషం. తమిళ చిత్ర పరిశ్రమలో రమణన్ మల్టీటాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు సొంతం చేసుకున్నారు. 

రమణన్ కి ఇద్దరు కుమార్తెలు లక్ష్మి, సరస్వతి సంతానం. లక్ష్మీ కుమారుడే యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్. తన తాత గారు మరణించడంతో అనిరుద్ ఫ్యామిలీ శోకంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. అనిరుధ్ కూడా వారసత్వాన్ని అందిపుచ్చుకుని చిత్ర పరిశ్రమలో సంచలన సంగీత దర్శకుడిగా ఎదిగారు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల చిత్రాలకు అనిరుద్ అద్భుతమైన సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. 

click me!