
హీరోహీరోయిన్లు తమ వ్యక్తిగత వివరాలు మొదలు సినిమా అప్‌డేట్స్ గురించి ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. ఫ్యాన్స్ సైతం తమ అభిమానుల గురించి తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌నే వేదికగా మార్చుకుంటున్నారు. దీంతో పలువురు తారలకు నెట్టింట నిత్యం ట్రెండ్ అవుతుంటారు. అలాగే ఈ ఏడాది ఒక హీరోయిన్ తెగ ట్రెండింగ్‌లో నిలిచింది. 2024లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరు కాదు యానిమల్ సినిమాతో దేశాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్న అందాల తార తృప్తి డిమ్రీ.
కేవలం ఒకే ఒక సినిమాతో నేషనల్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకుందీ చిన్నది. అంతకు ముందు పలు చిత్రాల్లో నటించినా యానిమల్ మూవీతో భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో కొద్ది సేపే నటించినా తనదైన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది. యానిమల్ మూవీలో హీరోయిన్ రష్మికకు ఎంత పాపులారిటీ వచ్చిందో అంతకంటే ఎక్కువ పాపులారిటీ తృప్తి డిమ్రీని దక్కిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బ్యూటీ గురించి సోషల్ మీడియాతో పాటు గూగుల్‌లోనూ తెగ వెతికేశారు.
త్రిప్తి స్పందిస్తూ..
దేశంలో ఉన్న బడా సెలబ్రిటీలను వెనక్కి నెట్టి మరీ త్రిప్తి డిమ్రీ గూగుల్‌లో నెంబర్ వన్ స్థానంలో నిలించింది. ఇలా ఒకే ఒక సినిమాతో ఇలాంటి అరుదైన గుర్తుంపు సంపాదించుకోవడం పట్ల ఈ బ్యూటీ ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. తన గురించి తెలుసుకోవాలని అంతమంది ఉత్సాహపడ్డారంటే అది నిజంగానే తన విజయమే అని చెప్పుకొచ్చింది. ఈ క్రేజ్‌కి కేవలం యానిమల్ మూవీ మాత్రమే కారణమని ఆమె తెలిపింది. ఇక యానిమల్ మూవీలో తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడు సందీప్‌కు కృతజ్ఞతలు చెప్పిన ఈ బ్యూటీ, యానిమల్ 2 మూవీ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. మరి కొత్తేడాది ఈ బ్యూటీకి ఎలాంటి సక్సెస్ తీసుకొస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే త్రిప్తి డిమ్రీకి సంబంధించి పలు విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపించారు. ముఖ్యంగా ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ వివరలతో పాటు తెలుగులో త్రిప్తి నటించిన సినిమాలకు సంబంధించిన వివరాల కోసం సెర్చ్ చేశారు. అదే విధంగా త్రిప్తికి వివాహం అయ్యిందా అన్న విషయం గురించి కూడా నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేశారు. నిజానికి ఈ బ్యూటీకి ఇంకా పెళ్లి కాలేదు. కానీ ప్రేమలో ఉంది. సామ్ మర్చంట్ అనే వ్యక్తితో త్రిప్తి ప్రస్తుతం రిలేషన్‌లో ఉంది. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. త్రిప్తి గురించి నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న మరో అంశం అప్‌కమింగ్ మూవీస్ గురించి. ఇదిలా ఉంటే ఐఎండీబీ (ఇండియన్ మూవీ డేటాబేస్) ఇటీవల విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలోనూ త్రిప్తి మొదటి స్థానంలో నిలవడం విశేషం.