మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఒకే వేదికపై కనిపిస్తే, అది ఫ్యాన్స్ కి `మెగా` ఫెస్టివల్ కావడం పక్కా.
మెగా ఫ్యామిలీ ఒకే చోటుకి చేరడమనేది ఫెస్టివల్స్ టైమ్‌లో జరుగుతుంది. సంక్రాంతి, దీపావళి, దసరా పండుగల సమయంలో వీరంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. అడపాదడపా పవన్ దీనికి మిస్ అవుతుంటారు. కానీ ఇప్పుడు పండక్కి ముందుగానే కలవబోతున్నారు. అరుదైన సందర్భం చోటు చేసుకోబోతుంది. ఒకే వేదికపైకి చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ రాబోతున్నారు. ఇదే ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ న్యూస్.
వీరంతా సినిమా ఈవెంట్లలో మెరిసి చాలా ఏళ్లే అవుతుంది. దశాబ్దం క్రితం అడపాదడపా కలిశారు. కానీ ఇప్పుడు కలవడం వేరు. ప్రస్తుతం ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో ఉన్నారు. మెగాస్టార్ తన మార్క్ ఇమేజ్‌తో స్థిరంగా ఉన్నారు. పరోక్షంగా ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అదే సమయంలో తన మార్క్ పవర్ స్టార్ ఇమేజ్‌ని కంటిన్యూ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా రాణిస్తున్నారు. `పుష్ప 2` సినిమాతో ఇండియన్ బాక్సాఫీసుని షేక్ చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా రాణిస్తున్నారు. ఇలా ఎవరికి వారు తమ స్థాయిలో టాప్‌లోనే ఉన్నారని చెప్పొచ్చు.
వీరంతా కలిసి ఒకే వేదికపైకి రాబోతున్నారు. మరో వారం రోజుల్లో ఈ మెగా ఫెస్టివల్ చోటు చేసుకోబోతుందట. మరి వీరంతా ఎందుకు కలుస్తున్నారో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అది రామ్ చరణ్ కోసం. ఆయన నటిస్తున్న `గేమ్ ఛేంజర్` సినిమా కోసం అని సమాచారం. అయితే గతంలో `గేమ్ ఛేంజర్` ట్రైలర్ ఈవెంట్‌కి చిరంజీవి గెస్ట్ గా వస్తారని, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ వస్తారనే టాక్ నడిచింది. కానీ అది కుదరలేదు. దీంతో ఇప్పుడు భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఏపీలో విజయవాడ సమీపంలో ఈ ఈవెంట్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌లో ఈ నలుగురు మెగా హీరోలు పాల్గొనబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి.
రామ్ చరణ్ నటించిన `గేమ్ ఛేంజర్` సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 10న దీన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలు షురూచేసింది టీమ్. ఈ క్రమంలో జనవరి 4న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించాలనుకుంటున్నారట. ఈ ఈవెంట్‌లో చిరంజీవితోపాటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ లుగా రాబోతున్నారట. వీరితోపాటు నాగబాబు, మెగా హీరోలు కూడా ఈవెంట్‌లో పాల్గొనబోతున్నారట. ఓ రకంగా ఇది `మెగా` ఈవెంట్‌లా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో నిజమెంతా, ఇది ఎంత వరకు సాధ్యమవుతుందనేది ఆసక్తికరం. ఇదే వర్క్ అయితే మెగా ఫ్యాన్స్ కి కనువిందు చేసే దృశ్యం అవుతుందని, అదొక మెగా ఫెస్టివల్ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అల్లు అర్జున్ `పుష్ప 2` సినిమాతో ఇండియన్ బాక్సాఫీసుని షేక్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే 1700కోట్లు దాటేసింది. ఇక `బాహుబలి2` రికార్డులను త్వరలోనే బ్రేక్ చేయబోతుంది. దీంతోపాటు `దంగల్` సినిమా ప్రపంచ రికార్డులను సైతం బ్రేక్ చేసేందుకు రెడీ అవుతుంది. అదే సమయంలో అల్లు అర్జున్ చుట్టూ వివాదాలున్నాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మహిళ చనిపోవడం, చిన్న అబ్బాయిఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకోవడం, దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం, బన్నీపై కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కేసు కోర్ట్ లో ఉంది. ఈ క్రమంలో ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ బయటకు వస్తాడా? అనేది పెద్ద ప్రశ్న. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్టు వీరంతా వస్తే నిజంగానే ఇదొక `మెగా` ఫెస్టివల్ కాబోతుందని, మెగా ఫ్యామిలీ ఒక్కటే అనే సందేశం పాస్ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న `గేమ్ ఛేంజర్` చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్‌కి జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీకాంత్, అంజలి, సునీల్, ఎస్ జే సూర్య, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్రలో రాజకీయ నాయకుడిగా, మరో పాత్రలో ఐఏఎస్ అధికారికగా కనిపిస్తారట. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా ఉండబోతుందని సమాచారం.