#Animal:'యానిమల్' OTT రిలీజ్ డేట్, బోనస్ గా ఓ భారీ ట్విస్ట్?

Published : Jan 14, 2024, 06:46 AM IST
#Animal:'యానిమల్' OTT రిలీజ్ డేట్, బోనస్ గా  ఓ భారీ ట్విస్ట్?

సారాంశం

‘యానిమల్’ మూవీ త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా..


కేవలం థియేటర్లలో చూడనివాళ్లు మాత్రమే కాదు.. చూసినవాళ్లు కూడా ‘యానిమల్’ఎప్పుడు  ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే థియేటర్లలో కట్ అయిన కొన్ని సీన్స్‌ను ఓటీటీలో యాడ్ అవుతాయని తెగ  ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్‌లో హీరో రణబీర్ కపూర్, విలన్ బాబీ డియోల్ మధ్య ఇంటెన్స్ ఫైట్ సీన్ ఉంది. ఆ సీన్.. చాలామంది యాక్షన్ మూవీ లవర్స్‌ను కట్టిపడేసింది. అయితే ఆ సీన్ మధ్యలో బాబీ డియోల్.. రణబీర్ కపూర్‌ను ముద్దుపెట్టుకున్నానని, కానీ అది థియేటర్లలో విడుదల చేయలేదని, ఓటీటీ వర్షన్‌లో ఆ సీన్స్ ఉండే అవకాసం ఉందని సందీప్ బయిటపెట్టాడు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటికు రిలీజ్ డేట్ ఫిక్సైందనే వార్త ఫ్యాన్స్ ఆనందాన్ని కలగచేస్తోంది.  

‘యానిమల్’ మూవీ త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా యానిమల్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోంది. అఫీషియల్ గా  ప్రకటన ఇంకా రాలేదు. మామూలుగా  నార్త్ మల్టీప్లెక్సుల రూల్  ప్రకారం 45 రోజుల థియేట్రికల్ రన్ పూర్తయిపోవడంతో ఇంకే సమస్యా లేదు.  డిజిటల్ వెర్షన్ లో కట్ చేయని ప్రింట్ ఇస్తానని సందీప్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో అనటంతో... కనీసం పది నిమిషాలకు పైగా ఎక్స్ ట్రా ఫుటేజ్ ఉంటుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే నెట్ ప్లిక్స్ లో ఎక్స్ ట్రా ఫుటేజ్ ఉండకపోవచ్చు అని మరో ప్రక్క వినపడుతోంది. 

నెట్‌ఫ్లిక్స్ తాము తీసుకున్న  బాలీవుడ్ సినిమాల విడుదల విషయంలో ఒక సెన్సేషన్ డెసిషన్  తీసుకున్నట్టు వార్తలువచ్చాయి.    కేవలం సెన్సార్ అప్రూవ్ చేసిన థియేటర్ వర్షన్స్ మాత్రమే విడుదల చేయాలని, అన్‌కట్ వర్షన్స్ విడుదల చేయకూడదని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించుకుందట. నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న ఈ డెసిషన్  వల్ల ‘యానిమల్’లోని కేవలం రణబీర్ కపూర్, బాబీ డియోల్ ముద్దు సీన్ మాత్రమే కాదు.. అనేక  సీన్స్ ప్రేక్షకుల ముందుకు రాకుండానే మిగిలిపోతాయి.థియేటర్ లో విడుదలైన 3 గంటల 21 నిమిషాల సినిమా ఓటీటీలో మాత్రం ‘యానిమల్’ ఏకంగా 4 గంటల డ్యూరేషన్‌తో విడుదల అవుతుందని వార్తలు నిజం కాకుండా పోతాయి.
  
యానిమల్‌ చిత్రాన్ని భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని నిర్మించారు.  టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల అయ్యింది. మితిమీరిన ర‌క్త‌పాతం, అస‌భ్యక‌ర‌మైన కొన్ని హావ‌భావాలు, విన‌లేని డైలాగులు ఇబ్బంది పెడ‌తాయి. ఇవన్నీ ప్రక్కన పెడితే యూత్ కు పిచ్చ పిచ్చగా ఎక్కేసింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?