అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్... ఐకాన్ స్టార్ కు కోర్డు విధించిన షరతులివే..?

By Mahesh Jujjuri  |  First Published Jan 3, 2025, 6:23 PM IST

ఎట్టకేలకు అల్లు అర్జున్ కు ఊరట లభించింది. మధ్యంతర బెయిల్ పై బయట ఉన్న బన్నీకి.. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్ట్.. కొన్ని షరతులు కూడా విధించింది.  


ఎట్టకేలకు అల్లు అర్జున్ కు ఊరట లభించింది. మధ్యంతర బెయిల్ పై బయట ఉన్న బన్నీకి.. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్ట్.. కొన్ని షరతులు కూడా విధించింది.  


గత నెలరోజులుగా ప్రశాంతతలేకుండా.. సినిమా సక్సెస్ ను కూడా సెలబ్రేట్ చేసుకోలేకుండా ఇబ్బందిపడుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మధ్యంతన బెయిల్ పై బయటకు వచ్చిన అల్లు అర్జున్ కు తాజాగా ఉపశమనం లభించింది.  ఈ కేసులో బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది నాంపల్లి కోర్టు. రూ. 50 వేలు విలువ చేసే రెండు  పూచికత్తులపై ఈ బెయిల్ మంజూరు చేసింది. 

Latest Videos

అల్లు అర్జున్ కు  బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు కొన్ని షరతులు కూడా విధించింది.  ప్రతి ఆదివారము చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు. సాక్షులను ప్రభావితం చేయవద్దన్న న్యాయస్థానం, కేసును ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా మాట్లాడవద్దన్నారు.  దాంతో ఐకాన్ స్టార్ తో పాటు ఆయన  కుటుంబ, ఫ్యాన్స ఊపిరి పిల్చుకున్నారు. 

అల్లు అర్జున్ బెయిల్ పిటీషన్ పై నాంపల్లి కోర్డు లో జరిగిన వాదనల్లో పోలీసులు ఏమాత్రం వ్యతిరేకించలేదని తెలుస్తోంది. బెయిల్ రద్దు చేయాలి అని ప్రభుత్వం తరపులన గట్టిగా వాదించకపోవడం. విచారణకు సహకరిస్తే చాలు అని కోర్టులో పోలీసుల తరపున వాదనలు వినిపించడంతో అల్లు అర్జున్ కు బెయిల్ త్వరగా మంజూరు అయినట్టు తెలుస్తోంది. అయితే సినిమా ఇండస్ట్రీకి , ప్రభుత్వానికి మధ్య చర్చల కారణంగానే బన్నీ బెయిల్ కు రూట్ క్లియర్అయినట్టు వర్తలు వైరల్ అవుతున్నాయి. 

వివాదం ఎక్కడ మొదలయ్యింది...

భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన పుష్ప2 ప్రీమియర్ షో చూడటం కోసం సంధ్య థియేటర్ కు ఫ్యామిలీతో వచ్చారు అల్లు అర్జున్. ఈ సందర్భంగా జనాలు విపరీతంగా పెరగడంతో తొక్కిసలాట జరిగి.. రేవతి అనే మహిళ మరణించింది. ఆమె తనయుడు కోమాలోకి వెళ్ళాడు. ఈ విషయం పెద్ద వివాదంగా మారింది. అల్లు అర్జున్ పర్మీషన్ లేకుండా ర్యాలీ చేశారని... హీరో అలా రావడంతోనే ఓ మహిళ చావుకు కారణం అయ్యిందని పోలీసులు సంధ్య థియేటర్ తో పాటు.. బన్నీపై కూడా కేసు నమోదు చేశారు. 

అల్లు అర్జున్ ను ఏ 11 గా ఎఫ్ ఐ ఆర్ లో రాసిన పోలీసులు విచారణ చేసి.. 11 రోజుల తరువాత అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. అల్లు  అర్జున్ పర్మీషన్ లేకుండా అక్కడికి వచ్చారని, ముషీరాబాద్ స్టేషన్ నుంచి ర్యాలీగా వచ్చారని. థియేటర్ యాజమాన్యానికి ముందు ఈ విషయంలో లేఖ కూడా రాసినట్టు కేసునమోదు చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. అల్లు అర్జున్ పై సోషల్ మీదియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 

అల్లు అర్జున్ ప్రెస్ మీట్.. 

అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత మధ్యంతర బెయిల్ వచ్చింది. అయితే కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఆయన ఒక రాత్రి జైల్లో ఉండాల్సి వచ్చింది. దాంతో ఫ్యాన్స్ మండిపడ్డారు. బన్నీపై కావాలనే కక్షతో ప్రభుత్వం చేస్తుందటూ విపక్షలతో పాటు.. బన్నీ ప్యాన్స్ విమర్శించడం మొదలు పెట్టారు. చాలా మంది అల్లు అర్జున్ కు సపోర్ట్ గా నిలిచారు. ఇక బన్నీ బెయిల్ పైబయటకు వచ్చిన తరువాత ఇండస్ట్రీలో పెద్దలు చాలామంది ఆయన్ను కలిసి సంఘీభావం తెలిపారు. 

అయితే ఇది కూడా పెద్ద వివాదంగా మారింది. హాస్పిటల్ లో ప్రాణాలో పోరాడుతున్న పిల్లాడిని కాని..మరణించిన రేవతి ఫ్యామిలీని పరామర్శించలేరు కాని.. అల్లు అర్జున్ ను పరమార్శించడానికి కన్ను పోయిందా.. కాలు పోయిందా అంటూ.. ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు. దాంతో వివాదం మరింత ముదిరింది. అల్లు అర్జున్ థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు ప్రమాదం గురించి పోలీసులు చెప్పారని.. అయినా అతను సినిమా చూసి వెళ్తానంటూ చెప్పారని.. వారిబౌన్సర్లు అతి చేశారని.. జనాలను వాళ్లు తొయ్యడం మూలంగానే ఇదంతా జరిగిందన్నారు. 

దాంతో అల్లు అర్జున్ ఆవేశంగా ప్రెస్ మీట్ పెట్టారు. తనకు రేవతి చనిపోయిన విషయం తరువాత రోజు తెలిసిందని, తాను ర్యాలీగా వెళ్ళలేదంటూ కౌంటర ప్రెస్ మీట్ పెట్టారు. దాంతో పోలీసులు సాక్ష్యాలతో సహా.. ఈ కేస్ లో ఏం జరిగింది. పోలీసులు  బన్నీ దగ్గరకి వెళ్ళి చెప్పారా లేదా.. ర్యాలీ తీశారా లేదా అనే విషచాలు మొత్తం  మీడియాకు రిలీజ్ చేశారు. దాంతో వివాదం ముదిరింది.. అల్లు అర్జున్ పై విమర్శలు పెరిగాయి. ప్రభుత్వం సీరియస్ అయ్యింది. 

సినిమా పెద్దల రాయబారం.. 

ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్  గా ఉండటం.. బెన్ ఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు కూడా ఉండదు అని రేవంత్ ప్రకటించడంతో సినిమా పెద్దల్లో కదలిక వచ్చింది. వెంటనే ప్రభుత్వంతో చర్చలకు రెడీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని.. సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాలు చర్చించారు. 

అంతే కాదు సంధ్య థియేటర్ ఘటనలో బాధితులకు అల్లుఅర్జున్ కోటి రూపాయలు, సుకుమార్, నిర్మాతలు కలిపి మరో కోటి ఇలా రెండు కోట్లు పరిహారంతో పాటు.. హాస్పిటల్ ఖర్చులు కూడా  తామే చూసుకుంటామని ప్రకటించారు. ఇక ఇండస్ట్రీకి సంబంధించినసమస్యలు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్ళారు సినిమా పెద్దలు. అయితే అసెంబ్లీ లో చేసిన ప్రకటనకు కట్టబడి ఉన్నానన్న ముఖ్యమంత్రి.

తెలంగాణాలో బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పేశారు. ఇక పరిశ్రమకు ఏం కావాలన్నీ చేస్తామన్నారు, ప్రభుత్వానికి సినిమా పరిశ్రమకు మధ్య గ్యాప్ లేదని.. వారిపై తమకు ఎలాంటి విభేదాలు లేవంటూ చెప్పే ప్రయత్నం చేశారు. ఇక సినిమా పెద్దల రాయబారం వల్లే ఈకేస్ లో  బన్నీకి వ్యతిరేకంగా పోలీసులు పెద్దగా కౌంటర్ ఇవ్వనట్టు తెలుస్తోంది. దాంతో బన్నీకి బెయిల్ మంజూరు అయ్యింది. 

పుష్ప2 ప్రభంజనం

ఇక ఇదంతా జరుగుతుండగానే పుష్ప2 దేశ వ్యాప్తంగా ప్రభజనం సృష్టించింది. దాదాపు 18 00 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. 2000 కోట్లు లక్ష్యంగా థియేటర్లలో హోల్డ్ అయ్యి ఉంది పుష్ప2. సంక్రాంతి సినిమాలు వచ్చే వరకూ ఈసినిమా థియేటర్లలోనే ఉండే అవకాశం ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో అల్లు అర్జున్ ఊహించిన దానికంటే ఎక్కవే స్పందన రావడంతో పుష్ప2 టీమ్ ఫుల్ హ్యాపీగా ఉంది. అయితే ఈ సంఘటన వల్ల అల్లు అర్జున్ విజయోత్సవ సంబరాలు చేసుకోలేనిపరిస్థితి ఏర్పడింది. 

ఒక్క సారి మాత్రం ఈ వివాదం స్టార్ట్ అవ్వకముందు చిన్న సక్సెస్ మీట్ పెట్టారు బన్నీ. ఆ సక్సెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. దానివల్లే బన్నీని రేవంత్ రెడ్డి ఇలా టార్చర్ చేస్తున్నారంటూ.. విమర్శలు కూడా వచ్చాయి. అందులో నిజం లేదంటో వారికి కౌంటర్లు కూడా ఇచ్చారు కాంగ్రెస్ లీడర్లు. ప్రస్తుతం ఈకేసు సర్ధుమణిగినట్టే అని చెప్పాలి. బెయిల్ రావడంతో అల్లు అర్జున్ మళ్ళీ జైలుకు వెళ్లే గండం తప్పింది. దాంతో ఆయన్ను నమ్మకుని ఉన్ననిర్మాత లుదర్శకులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక అల్లు అర్జున్ నెక్ట్స్ స్టెప్ ఏంటో చూడాలి. 

click me!