‘ఫిల్మ్ మేకర్ గా తృప్తినిచ్చింది’.. 'భగవంత్ కేసరి’పై అనిల్ రావిపూడి కామెంట్స్

‘భగవంత్ కేసరి’ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. తొలిరోజు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ పై దర్శకుడు అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 
 

Anil Ravipudi Comments about Bhagavanth Kesari Result NSK

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna )  - టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari). షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గరపాటి, హరీశ్ పెద్ది గ్రాండ్ గా నిర్మించారు. బడ్జెట్ వైజ్ గానే కాకుండా ఈ చిత్ర విడుదలనూ పెద్దగానే ప్లాన్ చేశారు. ఎట్టకేళలకు ఈ చిత్రం నిన్న (అక్టోబర్ 19న) విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతటా మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది, 

ఇక బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం మంచి రిజల్ట్ నే అందుకుంది. తొలిరోజు రూ.32. 33 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బ్లాక్ బాస్టర్ దసరా విన్నర్ భగవంత్ కేసరి టైటిల్ తో ప్రెస్ మీట్ నిర్వహించారు. అనిల్ రావిపూడి, సాహు గరిపాటి, శ్రీలీలా, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమాను ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు థ్యాంక్యూ చెప్పారు. ఈక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

Latest Videos

డైరెక్టర్ గా పలు జానర్లలో సినిమాలు చేస్తూ వచ్చాను. పలు ప్రయోగాలతో సక్సెస్ అందుకున్నాను. కానీ ‘భగవంత్ కేసరి’ మాత్రం నాకు చాలా తృప్తినిచ్చింది. సినిమాను సక్సెస్ లో నడిపిస్తున్నందుకు ఆడియెన్స్ కు చాలా థ్యాంక్యూ. లాంగ్ రన్ లో మరిన్ని ఫలితాలు ఉంటుందని భావిస్తున్నా. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. త్వరలోనే సినిమా సక్సెస్ పై బాలయ్య బాబుగారితో కలిసి పెద్దగా సెలబ్రేషన్స్ జరుపుతాం.. అంటూ చెప్పుకొచ్చారు. 

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథనాయికగా నటించింది. శ్రీలీలా ‘విజ్జు పాప’ అనే ఇంట్రెస్టింగ్ రోల్ ను పోషించింది. జాతీయ అవార్డు గ్రహీత అర్జున్ రాంపాల్ విలన్ గా అలరించారు. ఎమోషన్స్, యాక్షన్, కామెడీ, విమెన్ ఎంపవర్ మెంట్ అంశాలు ఆడియెన్స్ కు ఆకట్టుకుంటున్నాయి. దీంతో సినిమాకు మంచి రెస్పాన్స్ అందుతోంది. ఇక థమన్ అందించిన సంగీతానికి కూడా ఫిదా అవుతున్నారు. 

vuukle one pixel image
click me!