‘భగవంత్ కేసరి’ మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. ఎంతంటే?

Published : Oct 20, 2023, 03:47 PM IST
‘భగవంత్ కేసరి’ మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. ఎంతంటే?

సారాంశం

నందమూరి నటసింహం ‘భగవంత్ కేసరి’ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. నిన్న విడుదలైన ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్ల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.   

నందమూరి నటసింహం బాలకృష్ణ - టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో నిన్న (అక్టోబర్ 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari). ఎమోషన్, యాక్షన్, కామెడీ కలగలిపిన ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ థియేటర్లలో సందడి చేస్తోంది. తొలిరోజు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. నటీనటుల పెర్ఫామెన్స్ కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. 

ముఖ్యంగా ‘భగవంత్ కేసరి’లో అనిల్ రావిపూడి దర్శకప్రతిభ, ఎంచుకున్న కథను సరైన రీతిలో తెరకెక్కించడం. ఎమోషన్, యాక్షన్ ను కలిపి చెప్పే ప్రయత్నం వంటి అంశాలు ప్రేక్షకులను మరింతగా మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇక థమన్ సంగీతానికి ఊగిపోతున్నారు. ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద కూడా బాలయ్య అదరగొట్టాడని తెలుస్తోంది. 

తాజాగా Bhagavanth Kesari First Day  Collections ను మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ32.33 కోట్లు రాబట్టిందని ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ తో కలెక్షన్ వివరాలను అందించారు. అయితే హైప్ క్రియేట్ చేసినా.. అంచనాలను పెంచేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయిందంటున్నారు. మెగాస్టార్ డిజాస్టర్ మూవీ ‘భోళాశంకర్’ డే1 కలెక్షన్లు రూ.33 కోట్లనూ దాటలేకపోయిందని అభిప్రాయపడుతున్నారు. అయితే టాక్ అదిరిపోవడంతో మున్ముందు కాసుల వర్షం ఖాయమని అంటున్నారు. 

ఇక ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటించింది. శ్రీలీలా కూతురు పాత్ర పోషించింది. నేషనల్ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్ గా అలరించారు. థమన్ సంగీతంతో అద్భుతమనిపించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుందీ చిత్రం. 

PREV
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?