మరోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్.. సంబరాల్లో వేణు, క్రేజీ పిక్ వైరల్

By Asianet News  |  First Published Oct 20, 2023, 5:08 PM IST

జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన వేణు ఇప్పుడు క్రేజీ డైరెక్టర్ గా మారాడు. వేణు తెరకెక్కించిన బలగం చిత్రం సృష్టించిన సంచలనం అలాంటిది.


జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన వేణు ఇప్పుడు క్రేజీ డైరెక్టర్ గా మారాడు. వేణు తెరకెక్కించిన బలగం చిత్రం సృష్టించిన సంచలనం అలాంటిది. తెలంగాణ గ్రామీణ భావోద్వేగాలు ఎంతో అద్భుతంగా తెరక్కించిన వేణు.. బలగం చిత్రంతో భారీ విజయం అందుకున్నాడు. ప్రస్తుతం బలగం చిత్రం అంతర్జాతీయంగా అనేక అవార్డులు సొంతం చేసుకుంటోంది. 

కెరీర్ పరంగా ఫుల్ జోష్ లో ఉన్న వేణు.. ఇప్పుడు కుటుంబ వ్యక్తిగా సంబరాల్లో మునిగిపోయాడు. వేణు మరోసారి తండ్రి అయ్యాడు. వేణు సతీమణి తాజాగా పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ హ్యాపీ న్యూస్ ని వేణు సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేశాడు. 

Latest Videos

మాకు అమ్మాయి జన్మించింది. ఈ శుభవార్తని మీ అందరితో షేర్ చేయడానికి చాలా సంతోషిస్తున్నా అంటూ వేణు పోస్ట్ చేశారు. వేణుకి ఆల్రెడీ కొడుకు ఉన్నాడు. ఇప్పుడు అమ్మాయి పుట్టడంతో వేణు ఫ్యామిలీ మొత్తం సంబరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. 

అయితే వేణు బలగం తర్వాత తన కొత్త చిత్రం ఇంకా ప్రకటించలేదు. వేణు తదుపరి చిత్రం కూడా దిల్ రాజు దర్శకత్వంలోనే ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

బలగం చిత్రంలో వేణు దర్శకత్వ ప్రతిభ చూసి అంతా ఆశ్చర్యపోయారు. అప్పటివరకు వేణు అందరికి కమెడియన్ గానే పరిచయం. కానీ బలగం చిత్రంతో వేణు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలని కంటతడి పెట్టించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

click me!