కిస్సులు వర్కౌట్ అయ్యాయి.. సుమ కొడుకు సినిమా బబుల్ గమ్ ట్రైలర్ ట్రెండింగ్

Published : Dec 16, 2023, 09:49 AM IST
కిస్సులు వర్కౌట్ అయ్యాయి.. సుమ కొడుకు సినిమా బబుల్ గమ్ ట్రైలర్ ట్రెండింగ్

సారాంశం

సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం బబుల్ గమ్. డిసెంబర్ 29న ఈ త్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.

సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం బబుల్ గమ్. డిసెంబర్ 29న ఈ త్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. తన కొడుకు తొలి చిత్రం కోసం సుమ కూడా వరుసగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. 

ఇప్పటికే విడుదలైన టీజర్ లో రోషన్, హీరోయిన్ మానస చౌదరి బోల్డ్ గా రెచ్చిపోయారు. టీజర్ కి మంచి హైప్ వచ్చింది. శుక్రవారం రోజు గ్రాండ్ గా నిర్వహించిన ఈవెంట్ లో రాఘవేంద్ర రావు, రానా దగ్గుబాటి, అనిల్ రావిపూడి లాంటి అతిథుల సమక్షంలో బబుల్ గమ్ ట్రైలర్ లాంచ్ చేశారు. 

ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గట్లుగా యువతని ఆకట్టుకునే అంశాలే ట్రైలర్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోషన్ కి జోడిగా ఈ చిత్రంలో మానస చౌదరి నటించింది. ఎలాంటి తడబాటు లేకుండా రోషన్, మానస ఇద్దరూ రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ లో రెచ్చిపోయారు. 

తెలంగాణ యాసలో రోషన్ డైలాగులతో మెప్పించే ప్రయత్నం చేశాడు. 'ఒకరోజు వస్తది వద్దనుకున్నా కనపడతా చెవులు మూసుకున్నా వినపడతా అప్పటి వరకు బతికున్నట్లు కూడా ఎవ్వనికి తెల్వకూడదు అంటూ రోషన్ చెబుతున్న డైలాగ్స్ ఇంటెన్స్ గా ఉన్నాయి. అయితే అర్జున్ రెడ్డి తరహాలో బైకులపై హీరోయిన్ తో రొమాన్స్.. అగ్రెసివ్ యాటిట్యూడ్ కనిపిస్తోంది. 

యువతే టార్గెట్ గా దర్శకుడు రవికాంత్ పేరెపు ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఉన్నారు. ఎలాగైతే నేం సుమ కొడుకు మొదటి చిత్రానికి మంచి బజ్ వచ్చింది. ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇప్పటికే ఈ ట్రైలర్ దాదాపు 2 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.కిస్సులు, బోల్డ్ రొమాన్స్ బాగా వర్కౌట్ అయినట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Highest Remuneration: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్ల పారితోషికాలు.. అత్యధికంగా తీసుకునేది ఎవరంటే?
బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్