
రెండు దశాబ్దాలుగా పైగా యాంకర్ గా రాణిస్తుంది సుమ కనకాల. నటిగా కెరీర్ మొదలుపెట్టిన అమ్మడు బ్రేక్ రాకపోవడంతో యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. బుల్లితెర మీద తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది. పలు సక్సెస్ ఫుల్ షోలకు సుమ యాంకరింగ్ చేశారు. అయితే కొన్నాళ్లుగా ఆమె హవా తగ్గుతూ వస్తుంది. గ్లామరస్ యాంకర్స్ సత్తా చాటుతున్న తరుణంలో సుమ చేస్తున్న షోల సంఖ్య తగ్గింది.
తాజా సర్వే లో సుమ ర్యాంక్ పడిపోయింది. ప్రముఖ సంస్థ ఆర్మాక్స్... మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీస్ తెలుగు పై సర్వే చేసింది. ఈ సర్వే లో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఈ లిస్ట్ లో యాంకర్ ప్రదీప్ మాచిరాజు మొదటిస్థానంలో ఉన్నాడు. మేల్ యాంకర్ గా ప్రదీప్ మాచిరాజు చాలా కాలంగా సత్తా చాటుతున్నాడు. ప్రదీప్ తర్వాత స్థానం సుడిగాలి సుధీర్ కి దక్కింది. జబర్దస్త్, ఢీ షోల నుండి తప్పుకున్నప్పటికీ బుల్లితెర ప్రేక్షకుల్లో సుధీర్ ఫేమ్ తగ్గలేదు.
ఇక మూడో స్థానంలో హైపర్ ఆది నిలిచాడు. జబర్దస్త్ వేదికగా వెలుగులోకి వచ్చిన హైపర్ ఆది ప్రస్తుతం... శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ రియాలిటీ షోలలో సందడి చేస్తున్నాడు. హైపర్ ఆది... ప్రదీప్, సుధీర్ ల తర్వాత నిలిచాడు. ఇక నాలుగో స్థానంలో యాంకర్ సుమ ఉన్నారు. ఒకప్పుడు ప్రదీప్, సుధీర్, హైపర్ ఆది... సుమకు జూనియర్స్. వాళ్ళందరూ ఆమెను వెనక్కి నెట్టి పాపులారిటీ లో ముందుకు వెళ్లారు.
ఇక ఐదో స్థానంలో చమ్మక్ చంద్ర నిలిచాడు. జబర్దస్త్ మానేశాక బుల్లితెర మీద చమ్మక్ చంద్ర పెద్దగా కనిపించడం లేదు. అయినా అతడు టాప్ 5లో నిలిచాడు. శ్రీముఖి, రష్మీ గౌతమ్ వంటి టాప్ యాంకర్స్ కి ఈ లిస్ట్ లో చోటు దక్కలేదు. కాగా సుమ సినిమా ఈవెంట్స్, స్టార్స్ ఇంటర్వ్యూలు ఎక్కువగా చేస్తుంది. సుమ అడ్డా పేరుతో ఒక టాక్ షో చేస్తుంది.