ఆ వ్యాధి డిప్రెషన్ కి గురి చేస్తుంది.. యాంకర్ రష్మి షాకింగ్ కామెంట్స్!

By Udayavani DhuliFirst Published Oct 19, 2018, 9:55 AM IST
Highlights

అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది యాంకర్ రష్మి. సోషల్ మీడియాలో కూడా ఆమెకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది యాంకర్ రష్మి. సోషల్ మీడియాలో కూడా ఆమెకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో రష్మి కాస్త బొద్దుగా కనిపిస్తుండడంతో ఆమె అభిమానులు ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా ఆమెని ప్రశ్నించారు.

ఆమె వీరాభిమాని ఒకరు.. 'ఇటీవల ఓ ఈవెంట్ లో మిమ్మల్ని చీరలో చూశాను. చాలా లావుగా కనిపిస్తున్నారు. మీ వయసులో ఉన్న తారలందరూ కూడా బాడీని స్లిమ్ గా మైంటైన్ చేస్తున్నారు.

మీరు కూడా శరీర బరువుపై శ్రద్ధ పెడితే బాగుంటుందని' ఆమెకి చెప్పగా.. దానికి రష్మి ''మీరు సూచించినట్లుగానే నేను చాలా కాలంగా నా ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నా బరువుకి  కారణం రుమాటిజం. నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ వ్యాధి ఉందని తెలిసింది. దీంతో లావు పెరగడం, తగ్గడం వంటివి జరుగుతుంటాయి.

ఇలాంటి విషయాలు ఒత్తిడి పెంచి, కాసింత డిప్రెషన్ కి గురి చేస్తాయి. ఈ వ్యాధి నుండి బయటపడడానికి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటుంటే పరిణామాలు కనిపించడం లేదు'' అంటూ చెప్పుకొచ్చింది. రష్మి వ్యాఖ్యలతో అభిమానులు చాలా బాధపడ్డారు. మీరు తొందరగా ఈ బాధ నుండి బయటపడాలని కోరుకుంటున్నట్లు ట్వీట్లు చేశారు. 
 

click me!