ఆఫర్ ఇస్తా.. నాకేంటి అన్నాడు: 'Rx100' హీరోయిన్ ఆవేదన!

Published : Oct 19, 2018, 09:29 AM IST
ఆఫర్ ఇస్తా.. నాకేంటి అన్నాడు: 'Rx100' హీరోయిన్ ఆవేదన!

సారాంశం

'Rx100'చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన నటి పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే క్రేజ్ దక్కించుకుంది. యూత్ లో ఆమెకి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమెకి మంచి అవకాశాలే వస్తున్నాయి. అయితే 'Rx100'సినిమాలో ఆమె బోల్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోవడంతో ఆమెకి అన్నీ అటువంటి అవకాశాలే వస్తున్నాయట.

ఒక సినిమాలో ముద్దు సన్నివేశాల్లో నటించానని అన్ని సినిమాలలో అలానే చేయమంటే ఎలా అని వాపోతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకి కాస్టింగ్ కౌచ్ మీకు కూడా ఎదురైందట కదా అని అడిగిన ప్రశ్నకి సమాధానంగా.. ''టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉంది. నటిగా నిరూపించుకున్న తరువాత కూడా ఈ కాస్టింగ్ కౌచ్ భూతం నన్ను వెంటాడడం బాధగా ఉంది.

'Rx100'సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ లో నటించినందుకునే ఈ వేధింపులు నాకు ఎదురవుతున్నాయని అనుకుంటున్నాను. ఇటీవల నన్ను ఒక వ్యక్తి కలిశారు. 'ఆఫర్ ఇస్తా.. మరి నాకేంటి..?' అన్నాడు. నేను షాక్ అయ్యాను. గట్టిగా రెండు చెంపలు వాయించాలని అనిపించింది. ఆ సమయంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి చాలా  కష్టపడ్డాను'' అంటూ చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?