
రష్మీ గౌతమ్ యానిమల్ లవర్ అన్న విషయం తెలిసిందే. ఎక్కడ మూగజీవాలు హింసకు గురైనా ఆమె స్పందిస్తారు. ఈ క్రమంలో ఆమె కొంత వ్యతిరేకత కూడా ఎదుర్కొంటూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి పెట్ డాంగ్ ని హింసిస్తున్న వీడియో రష్మీ దృష్టికి వచ్చింది. రష్మీ తీవ్ర ఆందోళనకు గురైంది. ఆ కుక్క పిల్లను కాపాడాలంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకుంది. ఢిల్లీ పోలీసులు, పెటా సంస్థ, ఎంపీ మేనకా సంజయ్ గాంధీలను సదరు ట్వీట్ లో ట్యాగ్ చేసింది.
అతడు చాలా క్రూయల్ గా ఉన్నాడు. అతని వలన ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ప్రమాదమే. పిల్లలను లైంగికంగా వేధించేవాడు, రేపిస్ట్ కూడా కావచ్చు. అంటూ తీవ్ర పదజాలంతో ఆవేదన వ్యక్తం చేశారు. రష్మీ గౌతమ్ ట్వీట్ వైరల్ అవుతుంది. పెట్ డాగ్ కి ఏమవుతుందో అని రష్మీ గౌతమ్ ఆందోళన చెందారు. కాగా బక్రీద్ పండగ వేళ జరిగే హింసను కూడా రష్మీ గౌతమ్ వ్యతిరేకించారు. దీంతో ఆమె మీద ముస్లిం సమాజం మండిపడింది.
ఆ మధ్య హైదరాబాద్ నగరంలో ఓ బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించాడు. అప్పుడు రష్మీ గౌతమ్ పై నెటిజెన్స్ మండిపడ్డారు. నీ లాంటి వాళ్ళ వలనే వీధి కుక్కలు పెరిగిపోతున్నాయి. మనుషుల మీద దాడులు జరుగుతున్నాయని ఏకిపారేశారు. అయినా రష్మీ వెనక్కి తగ్గలేదు. పిల్లల సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులది. వీధి కుక్కల తప్పేం లేదన్నట్లు మాట్లాడారు. జంతు ప్రేమికురాలిగా రష్మీ గౌతమ్ వీగన్ గా మారారు. ఆమె మాంసం, గుడ్లే కాదు, పాలు, పాల పదార్థాలు కూడా తినరు.
మరోవైపు రష్మీ యాంకర్ గా సత్తా చాటుతున్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో ఆమె యాంకర్ గా చేస్తున్నారు. నటిగా మాత్రం ఫెయిల్ అయ్యారు. రష్మీ గౌతమ్ కి హీరోయిన్ ఆఫర్స్ తగ్గాయి. వరుస పరాజయాల నేపథ్యంలో ఆమె పట్ల మేకర్స్ ఆసక్తి చూపడం లేదు. రష్మీ హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్.