
వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కే? పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రొమోషన్స్ షురూ చేశాడు. నిర్దేశించిన సమయంలో 'వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కే?' అని రాసున్న టీ షర్ట్స్ ఆన్లైన్లో ఫ్రీగా ఆర్డర్ చేసుకోవచ్చన్నారు. అందుకు ఒక లింక్ ప్రొవైడ్ చేశారు. వైజయంతీ మూవీస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో లింక్ అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు మూడు సార్లు టీ షర్ట్స్ అందుబాటులోకి తెచ్చారు. నేడు సాయంత్రం 7:11 నిమిషాలకు ఒక డ్రాప్ అందుబాటులోకి తెచ్చామన్నారు.
ఎలాగైనా టీ షర్ట్ పట్టేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు. సమయం కాగానే లింక్ క్లిక్ చేస్తే సర్వర్ ఎర్రర్ అని చూపిస్తుంది. అసలు సైట్ ఓపెన్ కాలేదు. జస్ట్ నాలుగు నిమిషాల తర్వాత స్టాక్ అయిపోయిందని ప్రకటించారు. అసలు సైటే ఓపెన్ కాలేదు, స్టాక్ అయిపొవడమేంటీ? ఇది పెద్ద స్కామ్, చీటింగ్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మూడు సార్లు ప్రయత్నం చేసినా ఇదే పరిస్థితి.
అసలు నిజంగా టీ షర్ట్స్ ప్రాజెక్ట్ కే టీమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారా? లేక లిమిటెడ్ గా వాళ్లే కొందరికి టీ షర్ట్స్ ఇచ్చి జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. మెజారిటీ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నువ్వూ వద్దు నీ టీ షర్ట్ వద్దు, సమయం బొక్కా అని కామెంట్ చేస్తున్నారు. ఇది కేవలం ప్రమోషనల్ ట్రిక్, కనీసం వేలల్లో కూడా టీ షర్ట్స్ ఇచ్చి ఉండరని కొందరి అభిప్రాయం.
కాగా ప్రాజెక్ట్ కే విడుదలకు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు నిర్మాత అశ్వినీ దత్ ఇలాంటి ట్రిక్స్ కి పాల్పడుతున్నారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే తెరకెక్కుతుంది. దీపికా పదుకొనె ప్రభాస్ కి జంటగా నటిస్తుంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక రోల్స్ చేస్తున్నారు. దిశా పటాని మరొక హీరోయిన్.