విషాదం.. ప్రముఖ లేడీ యాంకర్ మృతి.. ఆ వ్యాధితోనే కన్నుమూత

Published : Jul 10, 2023, 08:40 PM ISTUpdated : Jul 10, 2023, 08:43 PM IST
విషాదం.. ప్రముఖ లేడీ యాంకర్ మృతి.. ఆ వ్యాధితోనే కన్నుమూత

సారాంశం

ఇటీవల తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు హోస్ట్ గా వ్యవహరించిన ఫేమస్ యాంకర్ శివానీ సేన్ హఠాన్మరణం చెందారు. ఆమె మరణవార్తతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.   

ఫేమస్ యాంకర్, లైవ్ హోస్ట్ శివాని సేన్ (Shivani Sen)  తాజాా కన్నుమూశారు. దేశంలో ప్రారంభించిన, నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు శివాని సేన్ నే లైవ్ హోస్ట్ గా, యాంకర్ గా వ్యవహరించి విజయవంతం చేశారు. యాంకర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆమె 2005లో తన కెరీర్‌ను ప్రారంభించింది. అప్పటి నుండి, ఫోరల్ కార్పొరేట్ ఈవెంట్‌లు, కాన్ఫరెన్స్‌లు, మీడియా లాంచ్‌లు, వివాహాలు, వార్షిక ఈవెంట్‌లను నిర్వహిస్తూ వచ్చారు. 

దేశంలోనే ఫేమస్ యాంకర్ గా శివానీ పేరు తెచ్చుకున్నారు. రీసెంట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో నిర్వహించిన టీఎస్ దశాబ్ది ఉత్సవాలకు కూడా శివానీ హోస్ట్ గా వ్యవహరించారు. వేడుకను చాలా హుందాగా, ఉత్సాహభరితంగా కొనసాగించి విజయవంతం చేశారు. వేదికపై చిరునవ్వుతో కనిపించిన శివానీ తాజాగా కన్నుమూయడం అందరినీ బాధిస్తోంది. 

అయితే శివానీ కొద్దిరోజులుగా ఎపిలెప్టిక్ అనే బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. సడెన్ గా అనారోగ్యానికి గురై మృతి చెందింది. దీంతో బాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు, పలు సంస్థలు చింతిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికన ఆమె మృతికి నివాళి అర్పిస్తున్నారు. ఇక శివానీ సేన్ 2019లో మిసెస్ సౌత్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. 


 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు