పవన్ కళ్యాణ్ పై రష్మి వ్యాఖ్యలు!

By Udayavani DhuliFirst Published Dec 25, 2018, 3:56 PM IST
Highlights

యాంకర్ రష్మి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది. 

యాంకర్ రష్మి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది.

నెటిజన్లు ఆమె పెళ్లి, ప్రేమ, సినిమాలతో పాటు ప్రస్తుతం రాజకీయ పరిస్థుతుల గురించి కూడా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం గురించి మీరేం అనుకుంటున్నారని రష్మిని అడగగా.. ''మనం రాజకీయాల్లో చూడాలనుకుంటున్న మార్పును పవన్ తీసుకొస్తారని ఆశిస్తున్నా'' అంటూ జవాబిచ్చింది.

ఈ జవాబుతో పవన్ అభిమానులు రష్మిని తెగ పొగిడేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పమని నెటిజన్లు అడిగితే.. ''ఢీ సీజన్ 10 ఫినాలేకి వచ్చి బాగా సందడి చేశారు. కంటెస్టంట్ లతో ఎంతో సరదాగా ఉన్నారు'' అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఏ సినిమాకి సంతకం చేయలేదని మంచి కథలు వస్తే సినిమాలు చేస్తానని వెల్లడించింది. 

అనసూయ కంటే నేనే బెటర్.. రష్మి కామెంట్స్!

అంత డబ్బిస్తే రాత్రికి గడుపుతావా..? రష్మిని అడిగిన నెటిజన్!

సుమ, అనసూయ, రష్మిల రెమ్యునరేషన్ ఎంతంటే..?

వివాదంలో రష్మి...లీగల్ గా ప్రొసీడ్ అవుతానంటూ వార్నింగ్

సుధీర్ తో నేనా..? యాంకర్ రష్మి కామెంట్స్!
 

 

click me!