కృష్ణ - బాలకృష్ణ.. వాళ్లెవరసలు?

Published : Dec 25, 2018, 03:51 PM IST
కృష్ణ - బాలకృష్ణ.. వాళ్లెవరసలు?

సారాంశం

ఇటీవల ఎన్టీఆర్ చిత్ర యూనిట్ మొత్తం పాత్రలకు సంబందించిన నటీనటుల ఫుల్ లిస్ట్ ను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఆ లిస్ట్ లో రెండు పాత్రలకు సంబందించిన నటీనటులను తప్ప అందరి గురించి క్లారిటీ ఇచ్చేశారు.

ఇటీవల ఎన్టీఆర్ చిత్ర యూనిట్ మొత్తం పాత్రలకు సంబందించిన నటీనటుల ఫుల్ లిస్ట్ ను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఆ లిస్ట్ లో రెండు పాత్రలకు సంబందించిన నటీనటులను తప్ప అందరి గురించి క్లారిటీ ఇచ్చేశారు. అసలైన బాలకృష్ణ పాత్ర ఎవరు చేస్తున్నారు? అలాగే ఎన్టీఆర్ ను అన్నయ్య అని పిలిచే ఘట్టమనేని కృష్ణ పాత్ర ఎవరు చేస్తున్నారు అనేది సస్పెన్స్ గా మారింది. 

చిత్ర యూనిట్ ఆ విషయంలో ఇప్పట్లో క్లారిటీ ఇచ్చేలా లేదు. గతంలో మహానటి కోసం ఎన్టీఆర్ పాత్ర కోసం జూనియర్ ఒప్పుకోకపోవడంతో ఎదో గ్రాఫిక్స్ లో మ్యానేజ్ చేశారు. ఇక ఇప్పుడు అలా చేయడం కుదరదు. బాలకృష్ణ - కృష్ణ పాత్రల నిడివి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ఎవరినో ఒకరిని సెట్ చేశారని పక్కాగా చెప్పవచ్చు. అయితే సినిమా స్టార్ట్ అయ్యే ముందు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నప్పుడు మోక్షజ్ఞ బాలకృష్ణ పాత్రలో కనిపించే అవకాశం ఉందని అన్నారు. 

ఇక మహేష్ కూడా తన తండ్రి పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాక్ బాగానే వచ్చింది. అయితే మహేష్ ఒప్పుకోలేదని ఇన్ సైడ్ టాక్. చిత్ర యూనిట్ ఈ పాత్రలపై పెద్దగా స్పందించడం లేదు. మరి ఇంత సీక్రెట్ గా ఉంచుతున్నారు అంటే నిజంగా ఆ పాత్రల్లో నటించింది నిజంగా వారేనా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏదేమైనా సినిమా వచ్చే వరకు ఈ సప్సెన్స్ కు తెరపడేలా లేదు!

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌