Anasuya Bharadwaj: అనసూయ కన్నీళ్లను నమ్మొచ్చా..!

Published : Mar 22, 2023, 08:31 PM ISTUpdated : Mar 22, 2023, 08:34 PM IST
Anasuya Bharadwaj: అనసూయ కన్నీళ్లను నమ్మొచ్చా..!

సారాంశం

రంగమార్తాండ మూవీ ప్రెస్ మీట్లో కన్నీరు పెట్టుకుంది అనసూయ. ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే ఇదంతా ప్రమోషనల్ ట్రిక్ మాత్రమే అని నెటిజెన్స్ అభిప్రాయం.

అనసూయ ఏడిపించాలనుకునే వాళ్ళను ఏడిపించే టైపు. ఎమోషనల్ యాంగిల్ చాలా తక్కువ. నువ్వు కర్రతో కొడతా అంటే తాను కత్తితో నరుకుతా అంటుంది. వేల మంది ట్రోలర్స్ కి ఒక్కటే సమాధానం చెబుతుంది. ఎన్ని విమర్శలు వచ్చినా తన యాటిట్యూడ్, లైఫ్ స్టైల్ మార్చుకోదు. చెప్పాలంటే అనసూయ వెరీ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్. చిన్న చిన్న విషయాలకు ఎమోషనలై కన్నీరు పెట్టుకునే రకం కాదు. అలాంటిదేమైనా ఉన్నా పబ్లిక్ లో బయటపెట్టదు. 

అటువంటి అనసూయ రంగమార్తాండ ప్రమోషనల్ ఈవెంట్లో కన్నీరు పెట్టుకున్నారు. ఆపుకోవాలన్నా కన్నీరు ఆగడటం లేదన్నట్లు ప్రవర్తించారు. రంగమార్తాండ మూవీలో నటించాను. నా జీవితానికి ఇది చాలంటూ ఏడ్చేశారు. చెప్పాలంటే అనసూయకు ఆ ఏడుపు సూట్ కాలేదు. అది తన నైజం కూడా కాదు. ఇందులో ఏదో కిరికిరి ఉందని జనాల వాదన. అనసూయ ప్రమోషన్ కోసం వేసిన ట్రిక్ మాత్రమే, రియల్ ఎమోషన్ కాదంటున్నారు. 

ఇటీవల సమంత ఇలానే పబ్లిక్ లో ఏడ్చారు. సమంత మీద కూడా ఇదే తరహా విమర్శలు వినిపించాయి. ఆమె కేవలం సినిమా ప్రమోషన్ కోసం కన్నీళ్లు పెట్టుకుంటుంది. గతంలో యశోద చిత్రానికి సింపతీ తెచ్చుకోవడానికి మయోసైటిస్ అంటూ సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టింది. నిజానికి మాయోసైటిస్ ప్రాణాంతకం కాదు. అందరికీ వచ్చే వ్యాధే అంటూ ఓ నిర్మాత ఎద్దేవా చేశాడు. ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఏడ్చి సినిమాకు ప్రచారం తెచ్చుకోవడం నయా టెక్నిక్ అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. 

ఇక అనసూయ కెరీర్లో ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. హీరోయిన్ కావాలనే కోరికతో అనసూయ పరిశ్రమలో అడుగు పెట్టారు. ఆమెకు అవుట్ ఆఫ్ ఫోకస్ రోల్స్ మాత్రమే దక్కాయి. దీంతో కొన్నాళ్లు  జాబ్ చేశారు. 2013లో జబర్దస్త్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు, ఒక్క షో ఆమె దశ తిరిగేలా చేసింది. అనసూయ కల్లో కూడా ఊహించని రేంజ్, ఇమేజ్ ఆమె సొంతమయ్యాయి. ప్రస్తుతం అనసూయ పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ క్రైమ్ డ్రామా చిత్రీకరణ జరుపుకుంటుంది. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయని సమాచారం. 
 

PREV
click me!

Recommended Stories

Dhurandhar OTT విడుదల తేదీ ఖరారు.. బాహుబలి రేంజ్ సినిమా ఎక్కడ చూడాలో తెలుసా ?
O Romeo Trailer: ప్రభాస్ హీరోయిన్ నెక్స్ట్ మూవీ ఇదే, ట్రైలర్ అదిరిందిగా