`కాంతార 2` అప్‌ డేట్‌.. అదిరిపోయే వార్త చెప్పిన నిర్మాణ సంస్థ..

Published : Mar 22, 2023, 07:51 PM IST
`కాంతార 2` అప్‌ డేట్‌.. అదిరిపోయే వార్త చెప్పిన నిర్మాణ సంస్థ..

సారాంశం

కన్నడ నాట నుంచి వచ్చి సంచలనం సృష్టించిన సినిమా `కాంతార`. ఈ సినిమాకి సీక్వెల్‌  పార్ట్ 2 వస్తోన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఉగాది పండుగ సందర్భంగా అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. 

ఇండియన్‌ సినిమాలో `కాంతార` ఒక సంచలనం. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్‌ క్రియేట్ చేసిన చిత్రమిది. అసలు ఇలాంటి ఓ సినిమా వస్తుందనే విషయం తెలియకుండానే వచ్చి కలెక్షన్ల రికార్డులు సృష్టించింది. కన్నడలో విడుదలై హిట్‌ అయిన పది రోజుల తర్వాత ఇతర భాషల్లో విడుదలై షాకింగ్‌ కలెక్షన్లని సాధించింది. ఈ సినిమా నాలుగువందల కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టుకుంది. బడ్జెట్‌కి పది రెట్ల వసూళ్లు రాబట్టింది. మ్యాజికల్‌ హిట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. 

ఈ చిత్రానికి కన్నడ దర్శక, నటుడు రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహించారు. ఆయనే ప్రధాన పాత్రలో నటించారు. ఆయనకు జోడీగా సప్తమి గౌడ నటించారు. అడవి, అడవిలోని మనుషుల జీవనం, వారి సెంటిమెంట్‌, దైవం, అమాయకజనాన్ని మోసం చేయడం అనే అంశాలపై ఈ చిత్రం సాగుతుంది. చాలా రూట్‌ లెవల్‌లో తీసిన చిత్రమిది. చాలా నిజాయితీ ప్రయత్నం. అందుకే భాషతో సంబంధం లేకుండా సినిమాలోని ఎమోషన్‌ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యింది. సినిమా సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో దీనికి సీక్వెల్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. 

`కాంతార2`ని తెరకెక్కించబోతున్నట్టు చిత్ర బృందం చెబుతూ వస్తోంది. ఆ మధ్య సీక్వెల్‌పై దర్శకుడు రిషబ్‌ శెట్టి వర్క్ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. లొకేషన్స్ కూడా వెతుకుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఉగాది పండుగ సందర్భంగా దీనికి సంబంధించిన అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. `కేజీఎఫ్‌2` చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ `కాంతార`ని కూడా నిర్మించిన విషయం తెలిసిందే.  తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైందని తెలిపింది. ఈ మేరకు అభిమానులకు శుభవార్త చెప్పింది.

`మన కొత్త ఏడాది ఉగాది పండుగ సందర్భంగా `కాంతార` రెండో పార్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైందని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. ప్రకృతితో మన సంబంధాన్ని ప్రదర్శించే మరో ఆకర్షణీయమైన కథనాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేం ఆతృతగా ఉన్నాం. మరిన్ని అప్‌డేట్‌ ల కోసం వేచి ఉండండి` అని పేర్కొంది. దీంతో `కాంతార` లవర్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాని ఈ ఏడాది ద్వితీయార్థంలో పట్టాలెక్కించే వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి