Shahrukh khan పడిన మనోవేదన, టెన్షన్ గురించి ఆయన లాయర్ ముకుల్ రోహత్గి తెలియజేశారు. మాజీ అటర్నల్ జనరల్ అయిన మిస్టర్ రోహత్గి ముంబై హై కోర్టులో ఆర్యన్ తరపున వాదనలు వినిపించారు.
కొడుకు జైలు పాలవడం షారుక్ ని ఎంత మానసిక వేదనకు గురి చేసిందో తాజా ఉదంతమే నిదర్శనం. Shahrukh khan పడిన మనోవేదన, టెన్షన్ గురించి ఆయన లాయర్ ముకుల్ రోహత్గి తెలియజేశారు. మాజీ అటర్నల్ జనరల్ అయిన మిస్టర్ రోహత్గి ముంబై హై కోర్టులో ఆర్యన్ తరపున వాదనలు వినిపించారు.
లాయర్ రోహత్గి మాట్లాడుతూ... ఆర్యన్ ఖాన్ కి బెయిల్ వచ్చిందన్న వార్త, షారుక్ ని ఎంతో సంతోషానికి గురి చేసింది. ఆ న్యూస్ విన్న వెంటనే ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయని వెల్లడించారు. గత మూడు నాలుగు రోజులుగా షారుక్ చాలా నిస్పృహలో ఉన్నారు. ఆర్యన్ అరెస్ట్ తరువాత షారుక్ తన మిగతా పనులన్నీ పక్కనపెట్టేశారు. కనీసం వేళకు భోజనం చేస్తున్నట్లుగా కూడా కనిపించడం లేదు. కాఫీ మాత్రం వరుసగా కప్పు తర్వాత కప్పు తాగుతూ, ఆందోళనగా కనిపించారు.. అంటూ లాయర్ రోహత్గి చెప్పారు.
undefined
దాదాపు 24 రోజుల జైలు జీవితం తరువాత Aryan khan కి నిన్న ముంబై హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఆర్యన్ ఖాన్ తో పాటు కస్టడీలో ఉన్న అర్బాజ్ మర్చంట్, మున్మున్ దమేచా బెయిల్ పొందారు. బెయిల్ పొందినప్పటికీ ఆర్యన్ ఖాన్ ఇంకా విడుదల కాలేదు. లీగల్ ప్రాసెస్ లో జాప్యం వలన ఆయన నేడు విడుదలయ్యే అవకాశం కలదు.
Also read ఫలించిన 23 రోజుల నిరీక్షణ.. ఆర్యన్ ఖాన్‌కు ఊరట, బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్ట్
అక్టోబర్ 3న ఆర్యన్ ఖాన్ తో సహా ఆయన మిత్రులను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. సముద్రంలో క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీ నిర్వహించడంతో పాటు, నిషేధిత ఉత్ప్రేరకాలు వాడారనే అభియోగంపై వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అనంతరం రెండు సార్లు ఆర్యన్ ఖాన్ లాయర్లు Bail కోసం పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటీషన్ తిరస్కరణకు గురైంది. మూడవ ప్రయత్నంలో ముంబై హైకోర్ట్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది.
Also read పందులే గుంపులుగా ఆడతాయి.. సింహం సింగిల్‌గానే ఆడుతుందంటూ అనీ మాస్టర్ ఫైర్.. కొత్త కెప్టెన్ షణ్ముఖ్
ఆర్యన్ అరెస్ట్ అనంతరం షారుక్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. పూణేలో జరుగుతున్న అట్లీ మూవీ షూటింగ్ అర్థాంతరంగా ఆపివేశారు. ఆర్యన్ ఖాన్ ని ముంబై ఆర్థర్ జైలులో ఉంచగా, షారుక్ వెళ్లి స్వయంగా కలవడం జరిగింది. కోర్ట్ హియరింగ్స్ కి మాత్రం షారుక్ దంపతులు హాజరు కాలేదు. ఇక ఆర్యన్ ఖాన్ నిరపరాధి అంటూ పలువురు బాలీవుడ్ ప్రముఖులు అతనికి మద్దతుగా నిలిచారు.