AP Ticket Price: నానికి ఏం తెలుసు, క్షమాపణ చెప్పాలి.. నిర్మాత నట్టి కుమార్ ఘాటు వ్యాఖ్యలు

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 23, 2021, 03:02 PM IST
AP Ticket Price: నానికి ఏం తెలుసు, క్షమాపణ చెప్పాలి.. నిర్మాత నట్టి కుమార్ ఘాటు వ్యాఖ్యలు

సారాంశం

టాలీవుడ్ లో మరోసారి టికెట్ ధరల రగడ మొదలైంది. ఏపీలో టికెట్ ధరలపై చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలపై నియంత్రణ విధిస్తున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ లో మరోసారి టికెట్ ధరల రగడ మొదలైంది. ఏపీలో టికెట్ ధరలపై చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలపై నియంత్రణ విధిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఏపీలో థియేటర్స్ పై రైడ్స్ కూడా జరుగుతున్నాయి. చాలా థియేటర్స్ లో టికెట్ ధరలు రూ.15, రూ. 20గా నిర్ణయించారు. 

దీనితో ఈ ధరలతో థియేటర్లు నడపడం సాధ్యం కాదని యాజమాన్యాలు స్వచ్చందంగా థియేటర్స్ మూసివేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాని మీడియా సమావేశంలో ఏపీ టికెట్ ధరలపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. థియేటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణా కొట్టు వసూళ్లు బావున్నాయని కామెంట్స్ చేశాడు. ఏపీలో ఏదైతే జరుగుతోందో అది కరెక్ట్ కాదని వ్యాఖ్యానించాడు. నాని కామెంట్స్ తో మరోసారి టాలీవుడ్ లో వివాదం రాజుకుంది. 

నాని కామెంట్స్ కు ప్రభుత్వం నుంచి కౌంటర్ కామెంట్స్ వస్తున్నాయి. నిర్మాత నట్టి కుమార్ కూడా నాని కామెంట్స్ పై ఘాటుగా స్పందించారు. నట్టి కుమార్ మాట్లాడుతూ.. నానికి టికెట్ ధరల గురించి కానీ, కలెక్షన్స్ గురించి కానీ ఏమైనా అవగాహన ఉందా అని ప్రశ్నించారు. నాని మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాలి అని అన్నారు. 

ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉంది. కోర్టులో కూడా పిటిషన్ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నాని కామెంట్స్ చేయడం వల్ల సమస్య ఇంకా సంక్లిష్టం అవుతుందని నట్టి కుమార్ అన్నారు. నాని వెంటనే ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

Also Read: AP ticket prices:థియేటర్ కలెక్షన్స్ కంటే కిరాణా కొట్టు కలెక్షన్స్ బెటర్.. ఏపీ ప్రభుత్వంపై నాని సెటైర్స్

ప్రస్తుతం ఉన్న టికెట్ ధరల వల్ల నాని లాంటి హీరోలకు ఎలాంటి సమస్య లేదని అన్నారు. భారీ బడ్జెట్ చిత్రాలు ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి మూవీస్ కి ప్రాబ్లెమ్ ఉంటుంది. జనవరి 7 లోపు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని నట్టి కుమార్ అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్