వైఎస్సార్ యాత్రలో హాట్ యాంకర్!

First Published 30, Jun 2018, 12:45 PM IST
Highlights

బుల్లితెరపై యాంకర్ గా ఎంతో క్రేజ్ దక్కించుకున్న అనసూయ మెల్లమెల్లగా సినిమాలలో కూడా బిజీ 

బుల్లితెరపై యాంకర్ గా ఎంతో క్రేజ్ దక్కించుకున్న అనసూయ మెల్లమెల్లగా సినిమాలలో కూడా బిజీ అవుతోంది. 'రంగస్థలం' సినిమాలో ఆమె పోషించిన రంగంమత్త పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

ఈ సినిమా తరువాత తన కెరీర్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది అనసూయ. తాజాగా వైఎస్సార్ బయోపిక్ లో అవకాశం వస్తే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టత్మకంగా తెరకెక్కనున్న వైఎస్సార్ 'యాత్ర' బయోపిక్ లో అనసూయ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించే అవకాశం దక్కించుకుంది. కర్నూలు జిల్లాలోని ఓ పవర్ ఫుల్ లేడీ పాత్రలో ఆమె కనిపించబోతుందని సమాచారం.

ఈ విషయాన్ని త్వరలోనే అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. దర్శకుడు మహివిరాఘవ్ రూపొందిస్తోన్న ఈ సినిమాలో మమ్ముట్టి టైటిల్ రోల్ పోషించనున్నారు. ఇక వైఎస్ఆర్ భార్య విజయమ్మ పాత్రలో వేముగంటి అశ్రితా కనిపించనున్నారు. 

Last Updated 30, Jun 2018, 12:45 PM IST