యాంకర్ అనసూయకు కోపం వచ్చింది

Published : Nov 30, 2016, 12:35 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
యాంకర్ అనసూయకు కోపం వచ్చింది

సారాంశం

ఐటెమ్ గర్ల్ అంటారా అని అభిమానికి క్లాస్ పీకిన అనసూయ స్పెషల్ సాంగ్ అనాలి కానీ అలా అంటారా అంటున్న హాట్ యాంకర్ మీ ఆనందం కోసమే నేను పనిచేసేది అంటున్న అన్సూయ  

గతంలో సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్‌ల్లో అలరించేంకు ఐటెమ్‌ భామలు ప్రత్యేకంగా ఉండేవారు. ఇప్పుడా పద్ధతి పూర్తిగా.. మారిపోయింది. స్టార్‌ హీరోయిన్లే ఐటెమ్‌ పాటల్లో మెరవడానికి సిద్ధపడుతున్నారు. రెండు, మూడ్రోజులు షూటింగ్‌ల్లో పాల్గొని కోటి రూపాయలు దక్కించుకుంటున్నారు. అయితే ఐటెమ్‌ భామలుగా పిలిపించుకోవడానికి మాత్రం సిద్ధపడడం లేదు.

 

దీంతో ఐటెమ్‌ సాంగ్‌ కాస్తా స్పెషల్‌ సాంగ్‌గా మారిపోయింది. ఇప్పుడు సాయిధరమ్‌ తేజ్‌ ‘విన్నర్‌’ సినిమాలో ఓ సాంగ్‌లో ఆడిపాడింది హాట్‌ యాంకర్‌ అనసూయ. ఇటీవలె ఆమె ఆన్‌లైన్‌ లైవ్‌ షోలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఒక అభిమాని ‘మీరు విన్నర్‌ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ చేస్తున్నారట కదా’ అని అడిగాడు.

 

ఈ మాటకు అనసూయ సీరియస్‌ అయిపోయింది. ‘ఐటెమ్‌ ఏంటి? అసలు ఐటెమ్‌ అంటే అర్థం ఏమిటి? ఐటెమ్‌ అంటే వస్తువు అని అర్థం. ఆడవాళ్లు నీకు వస్తువులా కనబడుతున్నారా? మీ ఆనందం కోసం స్పెషల్‌ సాంగ్స్‌ లో నర్తిస్తుంటారంతే. దయచేసి అలాంటి పాటలను ఐటెమ్‌ సాంగ్స్‌ అని పిలవొద్దం’టూ క్లాస్‌ పీకింది. భలే ఐటమ్ కదా..

PREV
click me!

Recommended Stories

Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే