థాంక్ యూ బ్రదర్ ట్రైలర్: దారుణం, లిఫ్ట్ లోనే ప్రసవించిన అనసూయ!

Published : Jan 28, 2021, 04:38 PM ISTUpdated : Jan 28, 2021, 04:43 PM IST
థాంక్ యూ బ్రదర్ ట్రైలర్: దారుణం, లిఫ్ట్ లోనే ప్రసవించిన అనసూయ!

సారాంశం

థాంక్ యూ బ్రదర్ మూవీ ట్రైలర్ నేడు విడుదల కావడం జరిగింది. విక్టరీ వెంకటేష్ చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు. థాంక్ యూ బ్రదర్ మూవీలో అనసూయ నిండు గర్భిణి రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నిమిషాల ట్రైలర్ ఆసక్తికర అంశాలతో సాగింది.


స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ థాంక్ యూ బ్రదర్.  నేడు ఈ మూవీ ట్రైలర్ విడుదల కావడం జరిగింది. విక్టరీ వెంకటేష్ చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు. థాంక్ యూ బ్రదర్ మూవీలో అనసూయ నిండు గర్భిణి రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నిమిషాల ట్రైలర్ ఆసక్తికర అంశాలతో సాగింది. మాతృత్వం విలువ తెలియని రూడ్ మరియు హెడ్ వెయిట్ ఉన్న అబ్బాయి, ఓ గర్భిణి ప్రమాదంలో ఉంటే, కాపాడడానికి తాను తప్ప మరెవరు లేకుంటే... అతడు చర్యలు, నిర్ణయాలు ఎలా ఉంటాయనే కోణంలో థాంక్ యూ బ్రదర్ మూవీ తెరక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. 


గర్భిణిగా అనసూయ నటన, అప్పీరెన్స్ చాలా సహజంగా ఉన్నాయి. లిఫ్ట్ ప్రమాదంలో చిక్కుకున్న గర్భిణిగా అనసూయ అద్భుతంగా చేశారు. థాంక్ యూ బ్రదర్ మూవీలో మరో కీలక రోల్ చేసిన విరాజ్ అశ్విన్ ఆకట్టుకున్నారు. ట్రైలర్ లోనే సినిమా కాన్సెప్ట్ ఏమిటో చెప్పేసిన దర్శకుడు, ట్రైలర్ ఆసక్తికరంగా కట్ చేశారు. 


పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో విడుదల కానుందని సమాచారం. దర్శకుడు రమేష్ రాపర్తి థాంక్ యూ బ్రదర్ మూవీ తెరకెక్కించారు. మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారాకాంత్ బొమ్మిరెడ్డి నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గుణ బాల సుబ్రహ్మణ్యం సంగీతం అందించారు. మొత్తంగా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది.

PREV
click me!

Recommended Stories

NNNM: నారీ నారీ నడుమ మురారి మూవీకి ముందు అనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆయన చేస్తే సినిమా వేరే లెవల్‌
ఒకప్పుడు నయనతార ఆ స్టార్ హీరో మూవీని రిజెక్ట్ చేసింది.. ఎందుకంటే.?