`ఆర్‌ ఆర్‌ ఆర్‌`పై క్లారిటీతో డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్న స్టార్స్.. జులైలో వరుణ్‌ తేజ్‌ .. ఏప్రిల్‌లో గోపీచంద్

Published : Jan 28, 2021, 01:06 PM IST
`ఆర్‌ ఆర్‌ ఆర్‌`పై క్లారిటీతో డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్న స్టార్స్.. జులైలో వరుణ్‌ తేజ్‌ .. ఏప్రిల్‌లో గోపీచంద్

సారాంశం

`ఆర్‌ ఆర్‌ ఆర్‌` రిలీజ్‌ డేట్‌ ప్రకటించడంతో మిగిలిన హీరోలు తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. అల్లు అర్జున్‌ ఇప్పటికే ప్రకటించగా, తాజాగా వరుణ్‌ తేజ్‌ `గని`, గోపీచంద్‌ నటిస్తున్న `సీటీమార్‌` చిత్రాల విడుదల తేదీలను ఖరారు చేశారు.

వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం బాక్సింగ్‌ నేపథ్యంలో `గని` చిత్రంలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. జులై 30న దీన్ని విడుదల చేయబోతున్నట్టు తెలిపింది చిత్ర బృందం. గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. 

ఇప్పుడు వరుసగా సినిమా విడుదల అప్‌డేట్‌లు ప్రకటిస్తున్నారు. రాజమౌళి `ఆర్‌ ఆర్‌ ఆర్‌` విడుదల తేదీని ప్రకటించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. దీంతో మిగిలిన సినిమాలు ప్రకటిస్తున్నాయి. తాజాగా అల్లు అర్జున్‌ తాను నటిస్తున్న `పుష్ప` చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 13న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పుడు వరుణ్‌ తేజ్‌ కూడా తమ సినిమా డేట్‌ని ప్రకటించారు. 

మరోవైపు గోపీచంద్‌ సైతం తన సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందుతున్న `సీటీమార్‌` చిత్రాన్ని ఏప్రిల్‌ 2న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. మహిళా కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న `లవ్‌ స్టోరి` చిత్రాన్ని ఏప్రిల్‌ 16న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. 

ఇదే కాదు వరుసగా చిరంజీవి `ఆచార్య` చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. అలాగే ప్రభాస్‌ నటిస్తున్న `రాధేశ్యామ్‌`ని ఏప్రిల్‌లో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్