
హాట్ యాంకర్ అనసూయకి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఆమె చేసింది మంచి పనే అయినప్పటికీ.. విమర్శలు ఎదురుకోవాల్సి వచ్చింది. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే..
నిన్న సాయంత్రం తను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 దారిలో వెళుతుండగా, పక్కన కారు డ్రైవర్ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎదురుగా ఉన్న మొబైల్‌లో వీడియో చూస్తూ కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఈ సన్నివేశాలని అనసూయ తన మొబైల్ కెమెరాలో బంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌కి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది.
‘‘డియర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్.. ఇలాంటి సంఘటనలు నన్ను బయపెట్టిస్తున్నాయి. ఇంతక ముందు వేరే వారి తప్పిదం వలన నేను ప్రమాదానికి గురయ్యాను. దయ చేసి ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవర్స్‌ని వదలొద్దు.రోడ్స్ పై తమకిష్టమోచ్చినట్టు డ్రైవ్ చేసే వారికి ఇతరుల ప్రాణాలంటే లెక్కలేదా’’ అని అనసూయ తన ట్వీట్‌లో తెలిపింది.
అయితే.. పోలీసులకన్నా ముందు నెటిజన్లు ఈ ట్వీట్ కి స్పందించారు. పబ్లిక్ స్టంట్ కోసం ఇలా చేశావు అంటూ.. అనసూయను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కాగా.. ఆమె మరోసారి దీనిపై స్పందించారు. ‘మంచి కారణంతో ఓ వీడియో పెడితే ట్రోల్ చేస్తున్నారు. అయినా ఫర్వాలేదు. నేనేం తప్పు చేయలేదు. నేను చేసింది సరైన పనే’ అంటూ మరో ట్వీట్ చేశారు.
ఇక అక్కడి నుంచి మరికొందరు సైతం ఆమెపై విరుచుకుపడుతుండగా.. వారికి ఓపికగా వివరణలు ఇస్తూ సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. దిగి చెప్పే యత్నం చేయొచ్చు కదా అన్న ఓ వ్యక్తి ప్రశ్నకు.. అలా చేస్తే తర్వాత యూట్యూబ్‌ల్లో ఎలాంటి హెడ్డింగులు కనిపించేవో అందరికీ తెలుసంటూ అనసూయ బదులిచ్చారు.