
జబర్దస్త్ షో ద్వారా ఓ రేంజిలో పాపులారిటీ ని దక్కించుకొని ఆ తర్వాత సినిమాల్లో కీ రోల్స్ పోషిస్తూ ఇప్పుడు పాన్ ఇండియన్ రేంజ్ లో సెలబ్రిటీ స్టేటస్ ని దక్కించుకున్న నటి అనసూయ. సోలోగా నటించిన ఒకటి అరా సినిమాలు తప్పిస్తే మిగిలినవి అన్నీ దాదాపుగా హిట్ అయ్యాయి. దాంతో ఈమెకు క్యారక్టర్ ఆర్టిస్టు గా మంచి డిమాండ్ ఉండడం తో జబర్దస్త్ షో ని కూడా వదిలేసి దూసుకుపోతోంది. మరో ప్రక్క తాను ఎంత బిజీ గా ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియా లో తరుచు యాక్టీవ్ గానే ఉంటూ హాట్ టాపిక్ గా మారుతోంది ఆమె.
ఇక సినిమాల్లో రంగస్థలంలో రంగమత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అనసూయ .. పెద్ద సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇటీవలె పుష్ప సినిమాలో నటించి మరోసారి మెప్పించింది. 'దాక్షాయని' పాత్రలో మంగళం శ్రీను భార్యగా కనిపించింది. అయితే ఈ చిత్రంలో అనసూయ పాత్ర లెంగ్త్ తక్కువగా ఉందన్న కామెంట్స్ కూడా వచ్చినా, అదరకొట్టిందని అన్నారు.
పుష్ప సినిమాలో నటించేందుకు అనసూయ తీసుకున్న పారితోషికంపై ఎంతన్న దానిపై అప్పట్లో చర్చ మొదలైంది. ఈ సినిమాలో నటించేందుకు ఒక్కరోజుకే అనసూయ రూ. 1-1.5లక్షల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని చెప్పుకున్నారు. మొత్తంగా పదిరోజులకు పైగానే కాల్షిట్లు ఇచ్చి బాగానే తీసుకున్నట్లు సమాచారం. దీంతో పుష్ప చిత్రానికి గాను దాదాపు రూ.12 లక్షల వరకు అందుకుందని అన్నారు. ఇప్పుడు పుష్ప 2 రెమ్యునరేషన్ సంగతి ప్రక్కన పెడితే మిగతా సినిమా వాళ్లు తనను సంప్రదిస్తే మాత్రం రెట్టింపు తీసుకుంటోందని వినికిడి.
ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునేదాని ప్రకారం ...రోజుకి లక్షన్నర నుండి రెండు లక్షలు తీసుకునే అనసూయ రోజుకి మూడు లక్షలు డిమాండ్ చేస్తుందని అంటున్నారు. టాలెంట్ ఉన్నప్పుడు ఆమె పేరుతో బిజినెస్ జరుగుతున్నప్పుడు ఆ మాత్రం డిమాండ్ చేయటంలో తప్పేమీ లేదంటున్నారు . అనసూయ డిమాండ్ కి మేకర్స్ ఆమె కున్న బిజీ షెడ్యూల్స్, అలాగే ఆమె క్రేజ్ దృష్యా ఆమెకి అడిగిన రెమ్యునరేష్ ఇస్తున్నారు.
ఇక పుష్ప ఫస్ట్ పార్ట్‌లో అనసూయ రోల్ తక్కువగానే ఉన్నా సెకండ్ పార్ట్‌లో మాత్రం అనసూయ రోల్ కీలకంగా మారనుందని తెలుస్తుంది. ఫాహద్ ఫాజిల్‌తో కలిసి బన్నీపై పగ తీర్చుకునేలా అనసూయ క్యారెక్టర్ ఉండనుందని సమాచారం.