సెన్సేషనల్ సాంగ్ ‘నాటు నాటు’కు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు దక్కడం పట్ల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) స్పందించారు. ఇందుకు ఎస్ఎస్ రాజమౌళి రిప్లై ఇచ్చారు. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బన్నీ రియాక్షన్ పైన ఫుల్ ఖుషీ అవుతున్నారు.
‘ఆర్ఆర్ఆర్’లోని సెన్సేషనల్ సాంగ్ ‘నాటు నాటు’కు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అమెరికాలోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్స్ వేడుక నిన్న అట్టహాసంగా జరిగింది. ఈ వేడకకు ట్రిపుల్ ఆర్ టీమ్ హాజరైంది. ‘నాటు నాటు’ లైవ్ మ్యూజిక్ పెర్ఫామెన్స్ తో రాహుల్, కాల భైరవ అదరగొట్టారు. అనంతరం అవార్డును ప్రకటించడంతో.. ఎంఎం కీరవాణి, లిరిస్టిస్ట్ చంద్రబోస్ ఆస్కార్ వేదికపై ప్రతిష్టాత్మకమైన అవార్డును స్వీకరించారు. Naatu Naatuకు ఆస్కార్ దక్కడం పట్ల భారతీయులు ఉప్పొంగిపోయారు. కలగా భావించిన అత్యుత్తమ అవార్డు ‘ఆర్ఆర్ఆర్’తో సాకారం కావడంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి.
టాలీవుడ్ సినీ స్టార్, ప్రముఖులు పొలిటికల్ లీడర్స్ అందరూ స్పందించారు. అయితే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం నాటు నాటుకు ఆస్కార్ దక్కడంపై కాస్తా ఆలస్యంగానే స్పందించారు. అయినా బన్నీ ఆనందాన్ని ట్వీట్ రూపంలో వ్యక్తం చేస్తూ ట్రిపుల్ ఆర్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. బన్నీ ట్వీట్ చేస్తూ... ‘భారతదేశానికి గర్వించే క్షణం. ఆస్కార్ వేడుకలో తెలుగు పాట షేక్ చేయడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఎంఎం కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవకు నా హ్రుదయపూర్వక అభినందనలు. ఇక ప్రపంచ మెచ్చేలా స్టెప్పులేసిన నా ప్రియమైన గ్లోబల్ స్టార్స్ లవ్టీ బ్రదర్ రామ్ చరణ్ కు, మన తెలుగు ఫ్రైడ్ తారక్ కు, అలాగే ఈ విజయానికి ఎంతో శ్రమించిన ఎస్ఎస్ రాజమౌళి గారికి అభినందనలు. ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ కు హార్ట్ టచ్చింగ్ మూమెంట్’ అని పేర్కొన్నారు.
దీనిపై ఎస్ఎస్ రాజమౌళి కూడా స్పందించారు. ‘థ్యాంక్ యూ బన్నీ’ అంటూ రిప్లై ఇచ్చారు.ఇదిలా ఉంటే.. బన్నీ ట్వీట్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎన్టీఆర్ ను అల్లు అర్జున్ ‘‘Our Telugu Pride’’ అంటూ మెన్షన్ చేయడంతో పొంగిపోతున్నారు. ఎన్టీఆర్ పై అల్లు అర్జున్ చూపిస్తున్న ప్రేమకు సంతోషిస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్, బన్నీ పోస్టర్లను షేర్ చేస్తూ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఏదేమైనా ఇండియాకు ‘ఆర్ఆర్ఆర్’తో ఆస్కార్ అవార్డు దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే కాస్తా ఆలస్యంగా ట్వీట్ చేశారని అంటున్నారు. అయినా తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ ‘పుష్ప : ది రూల్’ (Pushpa The Rule)లో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ కొనసాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు దాదాపు 350 కోట్లతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలోనూ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ‘పుష్ప2’ రిలీజ్ తర్వాత బన్నీ రేంజ్ మరోలా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
Big moment for INDIA 🇮🇳.
Elated to see a Telugu song shaking at the Oscars . Biggest Congratulations to garu , garu , master , brothers , , my beloved global stars , my lovely brother