
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వరసగా చేస్తున్న ప్రాజెక్టులలో సాహో దర్శకుడు సుజీత్(Sujeeth) ది కూడా ఒకటి ఉందనే సంగతి తెలిసిందే. ఓజీ- ఒరిజినల్ గ్యాంగస్టర్(OG-Original Gangstar) పేరుతో ఈ సినిమాను ఆ మధ్యన అఫీషియల్ గా ప్రారంభించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో పవన్ పాత్ర ఏంటి? ఎలాంటి లుక్‌లో కనిపిస్తారు? అనే చర్చ జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
అదేమిటంటే ఈ చిత్రం కథ ఎక్కువ శాతం ముంబైలోనూ,కొంతమేర జపాన్ లోనూ జరగనుంది. గ్యాంగస్టర్ డ్రామా గా జరిగే ఈ చిత్రం ఓ ట్విస్ట్ తో నడవనుంది. ఈ నేపధ్యంలో మొదట ముంబై లో షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే బౌండ్ స్క్రిప్టు పూర్తి చేసి పవన్ డేట్స్ కోసం సుజీత్ ఎదురుచూస్తున్నట్లు సమాచారం. అలాగే ఇప్పటికే పూర్తి చేసిన స్క్రిప్టుని త్రివిక్రమ్ ఓకే చేసి పవన్ కు రికమెండ్ చేసారని వార్త.
వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలు కానుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే 2023 దసరా కానుకగా అక్టోబరు 23న విడుదల చేయాలని అనుకుంటున్నారట. దసరా పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఓ రకంగా ఇది సుజీత్ కు ఛాలెంజింగ్ మూవీ, ప్రభాస్ తో చేసిన సాహో మూవీ పరాజయం తర్వాత సుజీత్ అదిరిపోయే రీతిలో రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడు. తనను తాను నిరూపించుకోవాలని అనుకుని చేసిన స్క్రిప్టు ఇది. పవన్ సినిమా తనకు వచ్చిన గోల్డెన్ ఆఫర్ గా భావించి స్క్రిప్టుపై బాగా వర్కౌట్ చేశాడని చెప్తున్నారు.
మరో ప్రక్క పవన్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా త్వరలో మొదలు కానుంది. ఈ చిత్రం తమిళ హిట్ తేరీ సినిమాకు రీమేక్ అనే విషయం తెలిసిందే.