Baby Teaser : ఆకట్టుకుంటున్న ‘బేబీ’ లవ్ స్టోరీ.. టీజర్ పై రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ రివ్యూ!

Published : Nov 22, 2022, 12:14 PM IST
Baby Teaser : ఆకట్టుకుంటున్న ‘బేబీ’ లవ్ స్టోరీ.. టీజర్ పై రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ రివ్యూ!

సారాంశం

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) నటించిన తాజా చిత్రం ‘బేబీ’. తాజాగా చిత్ర టీజర్ ను విడుదల చేశారు. సోల్ ఫుల్ లవ్ స్టోరీగా ఆకట్టుకుంటున్న ఈటీజర్ పై రష్మిక, విజయ్ రివ్యూ కూడా ఇచ్చారు.   

బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) దూసుకుపోతున్నాడు. హిట్.. ఫ్లాప్ లను పక్కనపెట్టిన విభిన్నకథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా ‘పుష్పక విమానం’, ‘హైవే’ చిత్రాలతో అలరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మరో బ్యూటీఫుల్ లవ్ స్టోరీ ‘బేబీ’ (Baby)తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తవడంతో సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. 

‘బేబీ’లో హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్నారు. చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల నేషనల్ అవార్డ్ అందుకున్న సాయి రాజేష్ తదుపరి చిత్రం కావడం సినిమాకు ప్లస్. రీసెంట్ గా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్  క్రేజీ అప్డేట్ వదులుతున్నారు. తాజాగా బ్యూటీఫుల్ లవ్ స్టోరీని తెలియజేలా టీజర్ ను వదిలారు. 

టీజర్ ను బట్టి చూస్తే.. ‘బేబీ’ హైస్కూల్ లవ్ స్టోరీగా తెలుస్తోంది.  బ్యూటీఫుల్ రొమాంటిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్మాల్ టౌన్ విలేజ్ బాయ్ గా ఆనంద్ దేవరకొండ నటిస్తున్నారు. స్కూల్ ఏజ్ లోనే ప్రేమ చిగురిస్తే వారి భావాలు ఎలా ఉంటాయని టీజర్ లో చూపించారు. సోల్ ఫుల్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు అందించబోతున్నారు. డైరెక్షన్ కొత్తగా కనిపిస్తోంది. నేపథ్యం సంగీతం కూడా మెలోడీ వెర్షన్ లో ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన ఈ టీజర్ కు మంచి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. 

అయితే, టీజర్ పై సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) కూడా స్పందించారు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉందంటూ విజయ్ రివ్యూ ఇచ్చారు. టీజర్ చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ అంటూ రష్మిక ఇన్ స్టా స్టోరీలో స్పందించారు. మరోవైపు రష్మిక  మందన్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ చాలా క్లోజ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘బేబీ’ టీజర్ పై ఇద్దరూ ఒకేసారి ఇన్ స్టాలో స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా విజయ్, రష్మిక విష్ చేయడంతో టీజర్ కు మరింత బలం చేకూరింది. మరోవైపు నాగబాబు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. యూట్యూబ్ లో #2గా ట్రెండ్ అవుతోంది. త్వరలోనే విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్