
యంగ్ అండ్ టాలెంటెడ్ స్టార్ ఆనంద్ దేవరకొండ హీరోగా యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ప్రముఖ రచయితా దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన లేటెస్ట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మూవీ బేబి. అందమైన.. అద్భుతమైన ప్రేమకథతో ఈసినిమా తెరకెక్కింది. అందమైన కథని ఇచ్చిన తాను మరో లవ్ స్టోరీ చేస్తుండడంతో... ఈ సినిమాపై మంచి హైప్ కూడా పెరిగింది.
ఈక్రమంలో తాజాగా ఈసినిమాకు సబంధించి ప్రతీ అప్ డేట్ హైలెట్ అవుతూ వచ్చింది. ఈవీలో పాట రిలీజ్ చేయగా.. హైలెట్ అయ్యింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. అది కూడా మంచి రెస్పాన్స్ ను సాధించింది. ఇక ఈసినిమా అప్ డేట్స్ పై కాస్త నెగెటీవ్ ఫీడ్ బ్యాక్ కూడా వస్తోంది. చాలా మంది బేబి మూవీపై నెగెటీవ్ కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఈకామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా హీరోయిన్ ను డీ గ్లామర్ లుక్ లో చూపంచడంపై విమర్షలు వస్తున్నాయి. ఆమెచాలా అందంగా ఉంటుంది.అటువంటి ఆమెను డీ గ్లామర్ లుక్ లో ఎందుకు చూపించారు అన్నట్టుగా విమర్షలు స్టార్ట్ అయ్యాయి. హీరోయిన్ ట్రాన్స్ఫర్మేషన్ పై కూడా లేటెస్ట్ గా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రాగా.. సోషల్ మీడియా వేదికగా.. ఆమె రెండు ఫోటోలు పెట్టి.. కామెంట్ చేశారు. దాంతో కాస్త చిర్రెత్తుకొచ్చిన ఆనంద్ దేవరకొండ... వారికి సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడు. ఇలాంటి కామెంట్స్ నిజానికి అనవసరం, సినిమా చూసిన తర్వాత మీరు మీ అభిప్రాయాన్ని చెప్పడం బెటర్ అంటూ రిప్లై ఇచ్చాడు.
హీరోయిన్ గ్లామర్ గానే ఉండాలి అని లేదు కదా..? బయట ఎంత గ్లామర్ గా ఉన్నా.. కథను బట్టి.. డీ గ్లామర్ చేయాల్సి వస్తే.. అది ఆమె పర్సనల్.. ఆమె డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. అంతే కాని సోషల్ మీడియా డిసైడ్ చేయదు కదా..? ఈ విషయంలో హీరోయిన్ కు లేని బాధ.. ఇలా నెట్టింట్లో విమర్షలు చేసేవారికి ఎక్కువై పోయింది. ట్రైలర్ చూసి.. సినిమా మొత్తన్ని జడ్జ్ చేయడకండి అని అంటున్నారు మూవీ మేకర్స్.. ఇక ఈసినిమా ఈ నెల 14న గ్రాండ్ గా రిలీజ్ అవ్వకడంకోసం ముస్తాబుతుంది.