
పుష్ప 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో లేటెస్ట్ షెడ్యూల్ షూట్ చేస్తున్నారని సమాచారం. కాగా పుష్ప 2 నుండి ఓ వీడియో లీక్ అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దట్టమైన అడవిలో లారీలలో పుష్పరాజ్ ఎర్ర చందనం తరలిస్తున్నాడు. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన సీన్ లా ఉంది. వీడియో చూస్తుంటే సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.
చాలా వరకు షూటింగ్ పూర్తి కాగా 2023 డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతుంది. పుష్ప సైతం ఇదే సీజన్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక పుష్ప 2 బడ్జెట్ రూ. 300 కోట్లని సమాచారం. రెండింతలు పెట్టుబడి పెట్టి తెరకెక్కించారు. వెయ్యి కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టడమే లక్ష్యంగా పుష్ప 2 బరిలో దిగుతున్నాడు.
దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతుండగా రష్మిక మందాన హీరోయిన్ గా నటించారు. పార్ట్ 2 లో రష్మిక చనిపోతుందట. దీన్ని ధృవీకరిస్తూ ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. శవంగా ఉన్న రష్మిక ఫోటో వైరల్ అయ్యింది. మరి ఆ ఫొటోలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా... మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలక రోల్స్ చేస్తున్నారు.