ప్రేక్షకులకు ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. అంతటా పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఓ థియేటర్ లో మాత్రం అభిమానులు రచ్చ చేశారు. ఆగ్రహంతో ఊగిపోయారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ వ్యాప్తంగా డార్లింగ్ కు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. ఇక అభిమానులు తమ హీరో సినిమా రిలీజ్ కు ఎంతటి హంగామా చేస్తుంటారో తెలిసిందే. ‘రాధే శ్యామ్’ తర్వాత ప్రభాస్ ‘ఆదిపురుష్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తొలిసారిగా పౌరాణిక చిత్రంతో అలరిస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
ఈరోజు ఉదయమే ఐమాక్స్ వంటి థియేటర్లలో ప్రీమియర్లు పడ్డాయి. దీంతో నిన్న అర్ధరాత్రి నుంచి సినిమా హాళ్ల వద్ద అభిమానులు పండుగ వాతావరణాన్ని ప్రారంభించారు. థియేటర్లు రామాలయాలను తలపించేలా తీర్చిదిద్దారు. ఉదయం నాలుగు గంటల నుంచి థియేటర్ల వద్ద పండుగ జరుపుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 9వేల థియేటర్లలో సినిమా విడుదలైంది. అంతటా రిలీజ్ బ్రహ్మండంగా జరిగింది.
అయితే, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో మాత్రం ప్రభాస్ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. థియేటర్ యాజమాన్యం తీరుకు చిర్రెత్తిపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలో ఉన్న జ్యోతి థియేటర్ లో ఆదిపురుష్ సినిమా ఆలస్యంగా ప్రదర్శించారు. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. మొదట సర్దుమణిగింది. అయితే థియేటర్ లోకి వెళ్లిన తర్వాత సౌండ్ సిస్టం సరిగా లేకపోవడం, డైలాగ్స్ సరిగా వినిపించకపోవడంతో అప్సెట్ అయ్యారు. థియేటర్ యాజమన్యంతో గొడవకు దిగారు. ఈ క్రమంలో థియేటర్ అద్దాలను పగలగొట్టారు. యాజమాన్యం వెంటనే సినిమా ప్రదర్శనను నిలిపేసి ప్రేక్షకులను బయటికి పంపించేశారు.
అయితే థియేటర్ల వద్ద పలువురు సినిమాలోని గెటప్స్ లో వచ్చి రివ్యూలు ఇస్తున్నారు. రాముడిగా, హన్మంతుడి గెటప్ లో వచ్చి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటిని అభిమానులు వ్యతిరేకించారు. ఇలాంటి వేషాలు ఎవరైనా చేస్తూ ఊరుకోమని హెచ్చరించారు. లైక్ లు, కామెంట్ల కోసం పిచ్చ వేశాలు వేయొద్దని, దేవుడి సినిమా కాబట్టి భక్తితో నడుచుకోవాలని సూచించారు. ఇక సినిమా భారీ హిట్ సాధించిందనే ఆనందంలో సంబురపడుతున్నారు.