
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన సినిమా ‘జై లవ కుశ’. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇటీవల రూ.100కోట్ల మైలు రాయిని కూడా దాటేసింది. ఈ సినిమా తర్వాత తారక్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
మరికొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నారట దర్శక నిర్మాతలు. ఇలోపు ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల ఎంపిక పనిలో పడ్డారట. ఇప్పటికే కీలక పాత్రల కోసం పలువురు సీనియర్ నటులను ఎంపిక చేశారట. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
ఐ, ఎవడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అమీజాక్సన్.. ఎన్టీఆర్- త్రివిక్రమ్ ల సినిమాకి హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు టాక్. ఈ విషయం తెలియాలంటే.. మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.