Amitabh Bachchan:అమితాబ్ ఇంట్లో కరోనా కలకలం..ఐసోలేషన్ లోకి

Surya Prakash   | Asianet News
Published : Jan 06, 2022, 07:20 AM ISTUpdated : Jan 06, 2022, 07:22 AM IST
Amitabh Bachchan:అమితాబ్  ఇంట్లో కరోనా కలకలం..ఐసోలేషన్ లోకి

సారాంశం

 మహారాష్ట్రపై కరోనా మహమ్మారి మరోసారి విరుచుకుపడుతోంది. కేసుల సంఖ్య ఊహకందని విధంగా పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే.. లాక్‌డౌన్ తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్ వేరియంట్ ఆస్పత్రిలో చేరే ప్రమాదం తక్కువగానే ఉన్నా.. మొత్తంగా చూస్తే కేసుల పెరుగుదలతో భారీ ముప్పు పొంచి కనపడుతోంది. కేసులు ఈ విధంగానే పెరుగుతూ ఉంటే చాలా మందికి తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ గురి అవుతారని అంచనా వేస్తున్నారు. ఆ అంచనాలకు తగినట్లుగానే కోవిడ్ కేసులు మన దేశంలోనూ పెరుగుతున్నాయి. సెలబ్రెటీలు ఈ ముప్పు నుంచి తప్పించుకోవటానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మెల్లిగా వారి ఇళ్లలో ప్రవేశిస్తోంది.  రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు ఇప్పటికే ఈ వైరస్ బారినపడ్డారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఇంట్లోనూ కరోనా కలకలం చెలరేగింది. ఈ విషయాన్ని అమితాబ్ ఖరారు చేసారు.

వివరాల్లోకి వెళితే...అమితాబ్ నివాసంలో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో బిగ్ బి కూడా ఐసోలేషన్ లోకి వెళ్లారు.  అమితాబ్ వద్ద పనిచేస్తున్న మిగతా 30 మంది సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించారు. వారికి టెస్టుల్లో నెగెటివ్ రిపోర్టు వచ్చింది. ప్రస్తుతం కరోనా సోకిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ముందస్తు జాగ్రత్తగా అమితాబ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఆ ఉద్యోగితో కలిసిన వారు కూడా ఐసోలేషన్ లోకి వెళ్లారు.

2020లోనే అమితాబ్ అభిషేక్ బచ్చన్ లు కరోనా బారినపడ్డారు. ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. ఒక వారం తర్వాత ఐశ్వర్య ఆరాధ్య కు కూడా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు తాజాగా అమితాబ్ నివాసంలో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా సోకడంతో ఆందోళన నెలకొంది.

Also Read : Akhanda OTT :'అఖండ'ఓటీటి రిలీజ్ డేట్ అఫీషియల్ ప్రకటన,సంక్రాంతి కి కాదు

PREV
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు