
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. విదేశాల్లోనూ ఈ చిత్రం సత్తాచాటుతూ కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. అదే సమయంలో సినిమా రిలీజ్ డేట్ విషయమై గత కొద్ది రోజులుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఓ ప్రక్కన థియోటర్ లో కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే డిస్ట్రిబ్యూటర్స్ ఇబ్బంది పడతారు. దాంతో నిర్మాత...ఓటీటి సంస్దతో చర్చలు జరిపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఓటీటి డేట్ మార్చారు. సంక్రాంతికి ఈ సినిమా ఓటీటిలో రావటం లేదని డిస్నీవారు తెలియచేసారు.
అఖండ తెలుగు చిత్రం ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుంది? అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. హాట్ స్టార్ రిప్లై ఇచ్చింది. 2022 జనవరి 21న ప్రీమియర్లో స్ట్రీమ్ కానుందని తెలిపింది. దాంతో ఫ్యాన్స్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అఖండ టెలివిజన్ ప్రిమియర్ విషయంలో కూడా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్ దక్కించుకున్న స్టార్ మా.. అఖండ సినిమాను ఫిబ్రవరి 27 న ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఓటీటీలలో విడుదలయ్యాక కూడా ఈ సినిమాకి మంచి వ్యూస్ లభిస్తాయని ,అక్కడా సూపర్ హిట్ అవుతుందని హాట్ స్టార్ భావోస్తోంది. సినిమాలోని కనీసం కొన్ని సన్నివేశాలనైనా సినిమా చూసిన వాళ్ళు మళ్ళీ చూడాలని అనుకుంటారని ఇక సినిమా అసలు చూడని వాళ్ళు కచ్చితంగా సినిమా చూస్తారని ఆ విధంగా ఈ సినిమాకి హాట్స్టార్ లో మంచివి వ్యూయర్షిప్ లభించబోతున్నట్లు అంచనా వేస్తున్నారు.
బోయపాటికి 2016 లో అల్లు అర్జున్ తో ‘సరైనోడు’ అనే హిట్ తర్వాత, 2017 లో బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘జయ జానకి నాయక’, 2019 లో రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ రెండూ ఫ్లాపయ్యాయి. ఇప్పుడు బాలకృష్ణ, బోయపాటి ఇద్దరూ తమ ఫ్లాపుల నేపథ్యాల నుంచి చేతులు కలిపి, ‘అఖండ’ తో అఖండ విజయాన్ని సాధించేందుకు విచ్చేశారు.
కేవలం పది రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ ని కలెక్షన్లను నమోదు చేసుకొని ఈ సినిమా ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో శ్రీకాంత్, నితిన్ మెహతా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు
Also Read :Shekar First Single:యాంగ్రీ స్టార్ రాజశేఖర్ 'శేఖర్' ఫస్ట్ సింగిల్ "లవ్ గంటే మోగిందంట" విడుదల