Megastar Praises Senapati: రాజేంద్ర ప్రసాద్ ఒక అద్భుతం.. మెగాస్టార్ చిరంజీవి ప్రశంస

Published : Jan 06, 2022, 07:14 AM ISTUpdated : Jan 06, 2022, 07:21 AM IST
Megastar Praises Senapati: రాజేంద్ర ప్రసాద్ ఒక అద్భుతం.. మెగాస్టార్ చిరంజీవి ప్రశంస

సారాంశం

సేనాపతి మూవీ చాలా బాగుందన్నారు మెగాస్టార్ చింరంజీవి. అందులో రాజేంద్ర ప్రసాద్ నటన అద్భుతమన్నారు. తన పెద్ద కూతురు సుస్మిత నిర్మించిన ఈ వెబ్ మూవీ గురించి చిరు ట్వీట్ చేశారు.

రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) నటించిన రిడెంప్ష‌న్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ సేనాపతి (Senapati) . రీసెంట్ గా  ఈ వెబ్ సిరీస్  ఫస్ట్ తెలుగు ఓటీటీ  ప్లాట్ ఫామ్ "ఆహా"లో స్ట్రీమింగ్  అయ్యింది. మంచి రెస్పాన్స్ కూడా రాబట్టింది. . ప్రేమ ఇష్క్ కాద‌ల్ వంటి సినిమాలను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ సాధినేని ఈ మూవీని డైరెక్ట్ చేశారు. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై "మెగాస్టార్ చిరంజీవి" (Megastar Chiranjeevi) కుమార్తె సుష్మిత కొణిదెల మరియు విష్ణు ప్ర‌సాద్ ఈ సిరీస్‌ను నిర్మించారు. రాజేంద్ర ప్రసాద్ తో పాటు న‌రేష్ అగ‌స్త్య, జ్ఞానేశ్వ‌ర్ కందేర్గుల‌, హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌, రాకేందు మౌళి త‌దిత‌రులు ఈ వెబ్ సిరీస్ లో లీడ్ రోల్స్ ప్లే చేశారు. 

 

ఈసినిమాను రీసెంట్ గా చూశారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). సినిమా చూసిన వెంటనే తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. యంగ్ డైరెక్టర్ పవన్ సాదినేని సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని.. ఇక నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వినుత్న పాత్రలో రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్ అద్భఉతంగా ఉందన్నారు. యువ నిర్మాతలు సుస్మిత, విష్ణుల కు ప్రేమాభినందనలు చెప్పారు మెగాస్టార్. ఆహాలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని ఆశిస్తున్నా అన్నారు మెగాస్టార్ చిరంజీవి.

 
జిగ్‌సా పజిల్ లో ఉండే అంశాల‌న్ని క‌లిసి ఓ వాస్త‌విక రూపానికి వస్తే ఎలా ఉంటుందో... అంతే అద్బుతంగా ఈ సిరీస్ ఉంది. ఈసినిమాలో రాజేంద్ర ప‌సాద్ ఇంతకు ముందెన్నడు కనిపించని  డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించారు. సాధార‌ణంగా రాజేంద్ర ప్ర‌సాద్ పేరు చెబితే చాలా పాత్రలు మన ముందు కదులుతాయి.అయితే.. ఈ  సేనాప‌తి(Senapati) సిరీస్‌లో మూర్తి అనే ఇంట్రెస్టింగ్.. అండ్ సీరియ‌స్ క్యారెక్టర్ లో రాజేంద్ర ప్ర‌సాద్ నటించారు. ఆయ‌న‌తో పాటు బ‌ల‌మైన పాత్ర‌ల్లో మిగతా ఆర్టిస్ట్ లు అలరించారు. యువతతో పాటు.. అనుభ‌వం ఉన్న‌ఆర్టిస్ట్ ల కాంబినేష‌న్‌లో రూపొందిన సేనాప‌తి..  టైట్ స్క్రీన్ ప్లే, ప‌వ‌ర్ ప్యాక్డ్ నెరేష‌న్‌, షార్ప్ పెర్ఫామెన్‌సెస్‌, యూనిక్ ప్లాట్‌తో ఆడియెన్స్‌ను అల‌రిస్తోంది.

Also Read : Akhanda OTT :'అఖండ'ఓటీటి రిలీజ్ డేట్ అఫీషియల్ ప్రకటన,సంక్రాంతి కి కాదు

PREV
click me!

Recommended Stories

Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌
Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?