
Amitabh Bachchan Retirement: అమితాబ్ బచ్చన్ వయసు 82. కానీ బిగ్ బి నటనకు ఎవరూ సాటి రారు. మంచి సినిమాలతో అభిమానులను అలరిస్తున్నారు. దీంతో పాటు కౌన్ బనేగా కరోడ్‌పతితో ఇంటింటా పేరు తెచ్చుకున్నారు. కోట్ల మంది అభిమానులు ఉన్న అమితాబ్ బచ్చన్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడంటూ వినిపిస్తున్న మాట.. అభిమానులను కంగారు పెట్టింది. అమితాబ్ పెట్టిన పోస్ట్ ఫ్యాన్స్ ను ఆలోచనలో పడేసింది. రిటైర్మెంట్ గురించి చెప్పిన అమితాబ్ బచ్చన్ ఆ తర్వాత తన పోస్ట్ గురించి క్లారిటీ ఇచ్చారు. అసలు అమితాబ్ బచ్చన్ ఏం చెప్పారు?
అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం, వయసు వల్ల సినిమా, కేబీసీ నుంచి రిటైర్ అవ్వాలని అనుకుంటున్నారని బిగ్ బీ పెట్టిన పోస్ట్‌ను చూసి చాలా మంది అనుకున్నారు. ఈ ఏజ్ లో కూడా నటిస్తూ.. తన అభిమానులను అలరించారు అమితాబ్. కాని ఆయన ఆరోగ్యం ఇక సహకరించకపోవడంతో రెస్ట్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. దానికితోడు రీసెంట్ గా ఓ రాత్రి అమితాబ్ బచ్చన్ కొన్ని పదాలతో ఒక పోస్ట్ చేశారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయే టైమ్ వచ్చింది అని పోస్ట్ చేశారు. కఈ పోస్ట్ అభిమానుల్లో కంగారు పుట్టించింది. అమితాబ్ బచ్చన్ నటన, కేబీసీ రెండింటికీ దూరం అవుతున్నారని అన్నారు.
Also Read: ఎన్టీఆర్ , కృష్ణ మధ్య టైటిల్ వార్, ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? గెలిచింది ఎవరు..?
కానీ రాత్రి చేసిన పోస్ట్ గురించి అమితాబ్ బచ్చన్ క్లారిటీ ఇచ్చారు. సినిమాలు నుంచి రిటైర్మెంట్ తీసుకునే దాని గురించి మాట్లాడుతున్నారని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు బిగ్ బి ఆ కన్ఫ్యూజన్‌ను క్లియర్ చేసి, తన పోస్ట్ అసలు అర్థం ఏమిటో చెప్పారు. నిజానికి అమితాబ్ బచ్చన్ "వెళ్ళిపోయే టైమ్ వచ్చింది" అని రాశారు. బిగ్ బి ఈ పోస్ట్ చేసిన తర్వాత, ఆయన తన ప్రోగ్రామ్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి', ప్రోగ్రామ్ లో ఈ విషయంపై మాట్లాడారు. అందరి అనుమానాలను పటాపంచలు చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రోమోలో బిగ్ బి అందరి అనుమానాలకు తెర దించారు.
Also Read: చిరంజీవి కంటే ముందు టాలీవుడ్ మెగాస్టార్ ఎవరో తెలుసా? చిరు మెగా హీరో ఎలా అయ్యారు?
Also Read: 100 కోట్లు ఇచ్చినా ఆ హీరో పక్కన నటించను, గోల్డెన్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన నయనతార, ఇంతకీ ఎవరా హీరో?