#NTR: ఆస్కార్‌ కోసం బయలు దేరిన యంగ్‌ టైగర్‌.. నయా లుక్‌లో ఎయిర్‌ పోర్ట్ లో హల్‌చల్‌

Published : Mar 06, 2023, 09:20 AM IST
#NTR: ఆస్కార్‌ కోసం బయలు దేరిన యంగ్‌ టైగర్‌.. నయా లుక్‌లో ఎయిర్‌ పోర్ట్ లో హల్‌చల్‌

సారాంశం

ఎన్టీఆర్‌ అమెరికా బయలుదేరారు. ఆస్కార్‌ కోసం ఆయన వెళ్తున్నారు. తాజాగా ఈ ఉదయం యంగ్‌ టైగర్‌ ఎయిర్‌ పోర్ట్ లో సందడి చేశారు. పిక్స్ వైరల్‌ అవుతున్నాయి.   

యంగ్‌ టైగర్‌, పాన్‌ ఇండియా స్టార్‌ ఎన్టీఆర్‌ (NTR) అమెరికా బయలు దేరారు. ఆస్కార్‌ కోసం ఆయన యూఎస్‌కి వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎయిర్‌పోర్ట్ లో సందడి చేశారు. ఈ రోజు సోమవారం(మార్చి 6) ఉదయం ఆయన ఎయిర్‌ పోర్ట్ లో కెమెరాలకు చిక్కారు. అక్కడి ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇందులో నయా లుక్‌లో ఎన్టీఆర్‌ ఆకట్టుకుంటున్నారు. ఇందులో తారక్‌ వైట్‌ టీషర్ట్, బ్లాక్‌ ప్యాంట్‌ ధరించారు. కొద్దిపాటి గెడ్డంతో చాలా స్టయిలీష్‌గా ఉన్నారు ఎన్టీఆర్‌. 

రామ్‌ చరణ్‌తో కలిసి ఎన్టీఆర్‌ హీరోగా నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR) ఆస్కార్‌ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని `నాటు నాటు` సాంగ్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌కి నామినేట్‌ అయ్యింది. ఈ నెల (మార్చి) 12న ఈ అవార్డుల ప్రధానం జరగనుంది. అత్యున్నత పురస్కారం `నాటు నాటు`కి వస్తుందని అంతా ఆశాభావంతో ఉన్నారు. ఇప్పటికే రామ్‌చరణ్‌, రాజమౌళి, కీరవాణి వంటి వారు అమెరికాలో సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్యూలిస్తున్నారు. ఆడియెన్స్ తో ముచ్చటిస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` స్పెషల్‌ స్క్రీనింగ్‌లోనూ పాల్గొంటున్నారు. 

ఈ విషయంలో రామ్‌చరణ్‌ కాస్త దూకుడు మీదున్నారు. ఆయన ముందే అమెరికా వెళ్లి తన హవా చూపిస్తున్నారు. అక్కడ ఆయనకు విశేష స్పందన లభిస్తుంది. వరుసగా అంతర్జాతీయ మీడియా మాధ్యమాల్లో ముచ్చటిస్తూ హాట్‌ టాపిక్‌ అవుతున్నారు. హాలీవుడ్‌ ఆఫర్ల కోసం వెయిట్‌ చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు ఎన్టీఆర్‌కి.. `తారకరత్న మరణం` కారనంగా లేట్‌ అయ్యింది. ఆయన ఎప్పుడో వెళ్లాల్సింది, కానీ అనుకోకుండా తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్‌ ఇక్కడేస్ట్రక్‌ అయిపోయారు. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అమెరికా వెళ్తున్నారు. ఇక తన జోరు కొనసాగించబోతున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

ఇటీవల హాలీవుడ్‌ క్రిటిక్స్ అసోసియేషన్‌ అవార్డులను `ఆర్‌ఆర్‌ఆర్‌`కి అందించిన విషయం తెలిసిందే. `ఆర్‌ఆర్‌ఆర్‌`కి నాలుగు పురస్కారాలు, రామ్‌చరణ్‌కి `స్పాట్‌లైట్‌` అవార్డు దక్కింది. అలాగే ఎన్టీఆర్, అలియాభట్‌లకు కూడా ఇవ్వబోతున్నారు. త్వరలోనే ఈ అవార్డులను ప్రధానం చేయబోతున్నామని `హెచ్‌సీఏ` ప్రకటించింది. మరోవైపు `ఆస్కార్‌` వేడుక సమయంలో `నాటు నాటు` సాంగ్‌ని లైవ్‌లో స్టేజ్‌పై పాడబోతున్నారు మన సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్‌, కాళ భౌరవ. ఇది నిజంగానే ఓ అరుదైన గౌరవంగా చెప్పొచ్చు. 

ఇక ఎన్టీఆర్‌ ఇప్పుడు కొరటాల శివతో `ఎన్టీఆర్‌30` చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమా కూడా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా, తారకరత్న మరణం కారణంగానే వాయిదా వేశారు. అయితే ఇందులో నటించే హీరోయిన్‌ ఎవరనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. జాన్వీ కపూర్‌ ఫైనల్‌ అయ్యిందని సమాచారం. నేడు ఆమె బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని కన్ఫమ్‌ చేయబోతుంది యూనిట్‌. ఈ మేరకు `ఎన్టీఆర్‌30` అప్‌ డేట్‌ కూడా ఇవ్వబోతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు