`కల్కి2898ఏడీ` సినిమా నుంచి అమితాబ్ బచ్చన్ పాత్రని వెల్లడించింది యూనిట్. ఈ మేరకు గ్లింప్స్ ని విడుదల చేసింది. కానీ అసలు విషయంలో నిరాశ తప్పలేదు.
ఇండియన్ సినిమాలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం `అశ్వత్థామ`. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రమిది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మైథలాజికల్ అంశాలతో ముడిపెడుతూ సైన్స్ ఫిక్షన్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. భవిష్యత్ కాలాన్ని ప్రతిబించించేలా ఆయన ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఎనిమిది వందల సంవత్సరాలకు ముందు, ఆరువేల సంవత్సరాల బ్యాక్ కి ముడిపెడుతూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట.
ఈ క్రమంలో కృష్ణుడు, విష్ణువు కాలం నాటి కథని, భవిష్యత్‌ని చూపించబోతున్నారు. ఈ క్రమంలో సినిమాలోని పాత్రల పేర్లు కూడా అలానే ఉండటం విశేషం. ఇప్పటికే ఇందులోని ప్రభాస్ పాత్రని పరిచయం చేశారు. భైరవగా ఆయన కనిపించబోతున్నట్టు తెలిపారు. ఆయన లుక్ విడుదల చేశారు.ఇప్పుడు అమితాబ్ బచ్చన్ పాత్రని పరిచయం చేశారు. స్టార్ స్పోర్ట్స్ ఇండియా ఛానెల్‌లో దీన్ని ప్రసారం చేశారు. ఇక సినిమాలో అమితాబ్ బచ్చన్.. `అశ్వత్థామ` పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు. `నేను ద్రోణాచార్య పుత్ర అశ్వత్థామ` అని అమితాబ్ బచ్చన్ చెప్పడం విశేషం.
undefined
శివలింగ వద్ద పూజా చేస్తున్న అమితాబ్ బచ్చన్‌కి గాయమవుతుంది. రక్తం కారుతుంది. దీంతో ఓ చిన్న పిల్లాడు నీకు మరణం లేదా? నువ్వు దేవుడివా? ఎవరు నువ్వు అని ప్రశ్నించగా, అక్కడి నుంచి లేచి వెళ్లిపోతూ `నేను ద్రోణాచర్య పుత్ర అశ్వత్థామ` అని అమితాబ్ బచ్చన్ చెప్పడం విశేషం. మధ్యలో ఆయన చేసే యాక్షన్ క్లిప్‌ని కూడా చూపించారు. ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. కానీ సినిమాపై హైప్ భారీగా ఉన్న నేపథ్యంలో దాన్ని రీచ్ అయ్యేలా ఈ గ్లింప్స్ లేకపోవడం గమనార్హం. కేవలం అమితాబ్ బచ్చన్ పాత్రని పరిచయం చేయడం వరకే ఉంది. కానీ ఆశించిన స్థాయిలో దాన్ని డిజైన్ చేయలేకపోయారనే కామెంట్ వినిపిస్తుంది.
Here's the awaited glimpse of pic.twitter.com/vJAekkBpUc
— GSK Media (@GskMedia_PR)దీపికా పదుకొనె, దిశా పటానీ, కమల్ హాసన్, రానా వంటి భారీ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌పై ఇంకా క్లారిటీ లేదు. ఈ రోజు అమితాబ్ బచ్చన్ గ్లింప్స్ తో రిలీజ్ డేట్ ఇస్తారని అంతా భావించారు. కానీ ఉసూరుమనిపించారు. మళ్లీ నిరాశ పరిచారు. ఇక ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్న విసయం తెలిసిందే. ఐదువందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.