కొడుకు సాధించిన ఘనత.. హీరో సూర్యలో ఉప్పొంగుతున్న ఆనందం చూశారా, వీడియో 

Published : Apr 21, 2024, 04:56 PM IST
కొడుకు సాధించిన ఘనత.. హీరో సూర్యలో ఉప్పొంగుతున్న ఆనందం చూశారా, వీడియో 

సారాంశం

హీరో సూర్యకి తమిళంలో ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అదే స్థాయిలో అభిమానులు ఉన్నారు. రజనీ తర్వాత ఈ ఘనత దక్కించుకున్న తమిళ హీరోల్లో సూర్య ఒకరు.

హీరో సూర్యకి తమిళంలో ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అదే స్థాయిలో అభిమానులు ఉన్నారు. రజనీ తర్వాత ఈ ఘనత దక్కించుకున్న తమిళ హీరోల్లో సూర్య ఒకరు. గజిని, సింగర్ సిరీస్, సూర్య సన్నాఫ్ కృష్ణన్ లాంటి చిత్రాలతో తెలుగులో కూడా సూర్యకి భారీ క్రేజ్ ఏర్పడింది.  

ప్రస్తుతం సూర్య కంగువ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు.  సూర్య సినిమా కోసం ఎంత డెడికేషన్ తో వర్క్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే కుటుంబాన్ని కూడా సూర్య అంతే జాగ్రత్తగా చూసుకుంటాడు. భార్య పిల్లల కోసం సమయం కేటాయిస్తాడు.  

అయితే సూర్య , జ్యోతిక దంపతులకు ఒక కొడుకు, కుమార్తె సంతానం. కొడుకు పేరు దేవ్ కాగా కుమార్తె పేరు దియా. ఇటీవల సూర్య తన కొడుకుతో ఉన్న వీడియో ఒకటి సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సూర్య కొడుకు దేవ్ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాడు. 

 

బ్లాక్ బెల్ట్ అందుకునే కార్యక్రమానికి సూర్య కూడా హాజరయ్యాడు. తన కొడుకుతో పాటు బ్లాక్ బెల్ట్ సాధించిన అందరు విద్యార్థులని సూర్య అభినందించారు. కొన్నిసార్లు కొడుకులు గొప్ప పని చేస్తే తండ్రికి కళ్ళల్లో ఆనందం తప్ప నోటి వెంట మాటలు రావు. సూర్య కూడా తన కొడుకుని చూస్తూ మురిసిపోతూ సంతోషంతో ఉప్పొంగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్
Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో