Ameesha Patel : ఆ చిత్రం తనకెప్పుడూ స్పెషలే అంటున్న అమీషా పటేల్.. తొమ్మిదేండ్ల తరువాత

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 25, 2022, 03:36 PM IST
Ameesha Patel : ఆ చిత్రం తనకెప్పుడూ స్పెషలే అంటున్న అమీషా పటేల్.. తొమ్మిదేండ్ల తరువాత

సారాంశం

తెలుగు, హిందీ చిత్రాల్లో తనదైన నటనా శైలితో అలరించిన అమీషా పటేల్ తాజాగా తనకు నచ్చిన మూవీ గురించి తెలిపింది. ఆ మూవీ ఎప్పటికీ తనకు స్పెషల్ అంటోందీ బాలీవుడ్ బ్యూటీ.  

మోడల్ గా తన కేరీర్ ను ప్రారంభించిన అమీషా పటేల్ తన తండ్రి స్నేహితుడు రాకేష్ రోషన్ సహకారంతో గ్లామర్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టింది. అప్పటి నుంచి తన కేరీర్ ను బిల్డఫ్ చేసుకునేందుకు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంది అమీషా పటేల్. బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు, ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా అమీషా పటేల్ చాలా సుపరితం. ‘కహోనా ప్యార్’ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తెలుగు, తమిళ బాషల చిత్రాల్లో నటించింది. తన నటనతో అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించింది. 

తన తొలి చిత్రం తర్వాత తెలుగులో అడుగుపెట్టింది అమీషా పటేల్. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ‘బద్రీ’లో పవన్ కళ్యాణ్ కు జంటగా నటించి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్పట్లో ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు, ప్రధానంగా యూత్ కు ఎంతగా నచ్చిందో తెలిసిన విషయమే. 

కాగా, అమీషా పటేల్ బాలీవుడ్ లోనూ సూపర్ హిట్ మూవీల్లో నటించి మెప్పింది. వాటిలో గదర్ : ఎక్ ప్రేమ్ కథ, హమ్రాజ్, సునో ససుర్జీ, మంగళ్ పాండే, హమ్ కో తుమ్సే పార్ హే, రేస్ 2 వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఈ మూవీల్లో తనకు ‘రేస్ 2’ మూవీ అంటే చాలా స్పెషల్ అంటూ తెలిపింది. ఎప్పటికీ తన మదిలో ఉండే పోయే సినిమా అంటూ పేర్కొంది అమీషా పటేల్. కాగా, ఈ చిత్రం రిలీజై తొమ్మిదేండ్లు పూర్తైన సందర్భంగా ఆ సినిమాను గుర్తుచేకుంది.  సినిమాలోని ఒక పాటకు సంబంధించిన వీడియో క్లిప్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. 

 

తెలుగులో బద్రీ, నాని, నర్సింహుడు, పరమవీర చక్ర, ఆకతాయి వంటి చిత్రాల్లో మెరిసిన ఈ సుందరి, ప్రస్తుతం బాలీవుడ్ లో నే నటిస్తోంది. ఇప్పటికే  ఈ హీరోయిన్ నటించిన  నాలుగు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. పోస్ట్ ప్రోడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు