అమలా పాల్ మళ్లీ పెళ్లి చేసుకుంటుందట.. అది కూడా ప్రేమ పెళ్లి

Published : Jun 16, 2017, 01:22 PM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
అమలా పాల్ మళ్లీ పెళ్లి చేసుకుంటుందట.. అది కూడా ప్రేమ పెళ్లి

సారాంశం

వివాదాస్పదమైన మళయాల బ్యూటీ అమలాపాల్ వివాహ జీవితం ప్రేమించి పెళ్లి చేసుకున్నా విడాకులు తీసుకున్న అమల మళ్లీ ప్రేమించి పెళ్లిచేసుకుంటానంటున్న అమలా పాల్

మళయాల బ్యూటీ అమలా పాల్ సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో వ్యక్తిగత విషయాలు, వివాదాలతోనూ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. తమిళ దర్శకుడు ఎఎల్.విజయ్‌తో ప్రేమాయణం, ఇంట్లో వారిని ఎదిరించి అతన్ని పెళ్లి చేసుకోవడం… సంవత్సరం తిరిగేలోపు విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచింది అమలాపాల్. ఇటీవలె సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఈ బ్యూటీ తనపై ఎవరు సానుభూతి వ్యక్తం చేయాల్సిన అవసరం లేదంటోంది.

 

తనకు ఇంకా బోలెడంత జీవితం ఉందని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఏదో పెళ్లి పెటాకులు అయ్యిందని తను సన్యాసం తీసుకోవడం లేదని …. తను మళ్లీ పెళ్లి చేసుకుంటాను అని స్పష్టం చేసింది. అది కూడా ప్రేమించే పెళ్లి చేసుకుంటానని కూడా స్పష్టం చేసింది. సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళ్లిపోను, పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెడతాను అని అమల నొక్కి చెప్పింది. ఎవరిని ప్రేమిస్తాను, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను అనే విషయాలు సమయం వచ్చినపుడు వెల్లడిస్తాను అని చెప్పుకొచ్చింది.

 

విడాకులు తీసుకున్న అమలాపాల్‌ కెరీర్‌లో ఎదగకుండా కుట్రలు పనున్నట్టు వదంతులు పుట్టుకొచ్చాయి. ఆ తరువాత అమలాపాల్‌ గ్లామర్‌ లో శ్రుతి మించుతోందంటూ విమర్శలువచ్చాయి. అయితే అవేమీ పట్టించుకోకుండా అవ కాశాల్ని అందిపుచ్చు కుంటూ కెరీర్‌లో దూసుకు పోతోంది అమలా పాల్‌.

PREV
click me!

Recommended Stories

ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..
Gunde Ninda Gudi Gantalu Today: ‘ఇతను ఎవరో నాకు తెలీదు’ మౌనిక మాటకు పగిలిన బాలు గుండె, మరో షాకిచ్చిన శ్రుతి