నటుడు కమల్ రషీద్ ఖాన్ అరెస్ట్.. కోర్టులో హాజరుపర్చిన ముంబై పోలీసులు.. ఇంతకీ ఏం జరిగింది?

By team teluguFirst Published Aug 30, 2022, 5:32 PM IST
Highlights

బాలీవుడ్ నటుడు, ప్రొడ్యూసర్ కమల్ రషీద్ ఖాన్ (Kamal Rashid Khan)ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో రషీద్ ఖాన్ వివాదాస్పదమైన ట్వీట్ చేయడంతో కేసు నమోదైంది.  దీంతో తాజాగా పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు.

బాలీవుడ్ లో కేఆర్ కే (KRK)గా ప్రసిద్ధి చెందిన నటుడు, ప్రొడ్యూసర్ కమల్ రషీద్ ఖాన్‌ (Kamal Rashid Khan)ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 2020లో వివాదాస్పదమైన కేసు పై కేఆర్ కే అగౌర్వంగా ట్వీట్ చేయడంపై మలాడ్ పోలీసులు ముంబైలో అరెస్టు చేశారు. తన విదేవీ ప్రయాణం ముగించుకొని ముంబై ఎయిర్ పోర్టుకు కేఆర్ కే చేరుకోగా విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు ముంబైలోని బోరివలి కోర్టులో కేఆర్ కేను హాజరు పరిచారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యూడిషియల్ కస్టడీకి ఆదేశించింది. ఇదే విషయాన్ని మీడియా సంస్థ ఏఎన్ఐ కూడా స్పష్టం చేసింది. అయితే 

2020లో కమల్ రషీద్ ఖాన్.. రిషి కపూర్ మరియు ఇర్ఫాన్ ఖాన్‌లకు వ్యతిరేకంగా ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఏముందంటే.. ‘రిషీ కపూర్ హెచ్ఎన్ రిలియన్స్ ఆస్ప్రతిలో చేరారు. నేను ఆయనికి చెప్పేది ఏంటంటే.. సార్ మీరు ప్రాణాలతో తిరిగి రావాలి. మీరు చనిపోవద్దు. ఎందుకంటే రెండు లేదా మూడు రోజుల్లో వైన్ షాప్స్ ఓపెన్ చేస్తారు’ అని ట్వీట్ చేశాడని ఆంగ్ల పత్రికలు తెలుపుతున్నాయి.  మరో ట్వీట్ లో.. ‘కరోనా కొంతమంది ప్రసిద్ధ వ్యక్తులను తీసుకోకుండా వెనక్కి వెళ్లదు. నేను కొన్ని రోజుల క్రితం చెప్పాను. ప్రజలు నన్ను తప్పు పట్టే అవకాశం ఉన్నందున పేర్లు రాయలేదు. కానీ ఇర్ఫాన్, రిషి వెళ్లిపోతారని నాకు తెలుసు. తర్వాతి వ్యక్తి ఎవరో కూడా నాకు తెలుసు’ అని KRK ట్వీట్ చేశాడు. 

దీంతో అప్పట్లో ఈ అవమానకరమైన  కామెంట్స్ పై కమల్ రషీద్ ఖాన్ పై FIR కూడా నమోదు అయ్యింది. కరోనాతో మరణించిన నటులిద్దరిపై కమల్ ఆర్ ఖాన్‌ చేసిన అగౌరవ వ్యాఖ్యలకు సెక్షన్ 294 (అశ్లీల చర్యలు లేదా బహిరంగంగా మాట్లాడినందుకు శిక్ష) మరియు IPC సంబంధిత ఇతర నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని ఓ అధికారి తెలిపారు. నటుడిగా, ప్రొడ్యూసర్ గా కొంత కాలం బాలీవుడ్ లో కనిపించిన కమల్ రషీద్ ఖాన్ 2014లో వచ్చిన ‘ఏక్ విలన్’లో ఓ పాత్రను పోషించాడు. ఆ తర్వాత నుంచి కనుమరుగయ్యాడు. అంతకు ముందు 2009లో రియాలిటీ షో ‘బిగ్ బాస్ హిందీ’ సీజన్ 3లో కంటెంటెస్ట్ గా పాల్గొన్నారు. 

 

| Borivali Court sends Kamal Rashid Khan to 14-day judicial custody.

He was arrested by Malad Police in Mumbai today, over his controversial tweet in 2020. https://t.co/87jgtiWrSC

— ANI (@ANI)
click me!