అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమాకి డైరెక్టర్‌ కన్ఫమ్‌, అస్సలు ఊహించరు.. టైటిల్‌ ఏంటో తెలిస్తే మతిపోవాల్సిందే

Published : Jun 13, 2025, 08:29 PM IST
allu arjun

సారాంశం

అల్లు అర్జున్‌ ప్రస్తుతం అట్లీతో సినిమా చేయబోతున్నారు. ఇప్పుడు మరో మూవీ ఓకే చేశారు.  ఓ నటుడి డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ చేతిలో చాలా ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీంతోపాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.  దీంతోపాటు ప్రశాంత్ నీల్‌తో ఓ మూవీ, సందీప్‌ రెడ్డి వంగాతో మరో మూవీ, సంజయ్‌ లీలా భన్సాలీతో, అలాగే నెల్సన్‌ దిలీప్ కుమార్‌తోనూ సినిమాలు చేయాల్సి ఉంది.

 ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఓ క్రేజీ దర్శకుడితో మూవీ చేయబోతున్నారు బన్నీ. మలయాళ దర్శకుడు బాసిల్‌ జోసెఫ్‌ తో మూవీకి కమిట్‌ అయినట్టు తెలుస్తుంది. 

అల్లు అర్జున్ తదుపరి సినిమా దర్శకుడు ఎవరు?

అల్లు అర్జున్ సినిమాకి బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నారని వార్తలు వస్తున్నాయి.  అట్లీ సినిమా తర్వాత బాసిల్ జోసెఫ్ సినిమాలో అల్లు అర్జున్ నటించే అవకాశం ఉందని సమాచారం. 

 బాసిల్ జోసెఫ్ మలయాళ దర్శకుడు. ఆయన గతంలో `మిన్నల్‌ మురళీ` తో అందరి దృష్టినీ ఆకర్షించాడు.  ఇప్పుడు నటుడిగా కూడా రాణిస్తున్నారు. శివకార్తికేయన్‌ `పరాశక్తి`లో కీలక పాత్రలో నటిస్తున్నారు.

 ఇలాంటి సమయంలో అల్లు అర్జున్‌ లాంటి పాన్‌ ఇండియా హీరోతో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకోవడం విశేషం. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ నిర్మించే అవకాశం ఉందని టాలీవుడ్‌ టాక్. 

ఇదిలా ఉంటే ఈ మూవీ టైటిల్‌ కూడా కన్ఫమ్‌ అయినట్టు సమాచారం. దీనికి `శక్తిమాన్‌` అనే పేరుని పరిశీలిస్తున్నారట. అట్లీ మూవీ తర్వాత ఇదే స్టార్ట్ అవుతుందని టాక్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

VFX కోసం 250 కోట్లు

అల్లు అర్జున్ 22వ సినిమా, అట్లీ 6వ సినిమా అయిన AA22xA06ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. హాలీవుడ్ రేంజ్‌లో ఫాంటసీ కథగా చెప్పుకుంటున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు పాత్రల్లో కనిపించనున్నారు. అందులో ఒకటి యానిమేషన్ పాత్ర అని తెలుస్తుంది.

 `జవాన్` లాంటి హిట్ సినిమాలు తీసిన అట్లీ, `పుష్ప2` హీరో కలిసి చేస్తున్న ఈ సినిమా బడ్జెట్ రూ.700 కోట్లు ఉంటుందని టాక్‌. అందులో అల్లు అర్జున్‌కి రెండు వందల కోట్ల పారితోషికం, దర్శకుడు అట్లీకి వంద కోట్లు ఇస్తున్నారట. ఇక వీఎఫ్‌ఎక్స్ కే  రూ.250 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఈ మూవీ 80శాతం సెట్‌లో ఉంటుందని, వీఎఫ్‌ఎక్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్
Radha Daughter: చిరంజీవి హీరోయిన్ కూతురు, గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయిందో చూడండి