బన్నీ అభిమానులకు చేదు వార్త.. డీజే ఇప్పట్లో లేనట్టే

Published : Apr 11, 2017, 11:19 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
బన్నీ అభిమానులకు చేదు వార్త.. డీజే ఇప్పట్లో లేనట్టే

సారాంశం

బన్నీకి స్కిన్ ఎలర్జీ డీజే షూటింగ్ వాయిదా రిలీజ్ డేట్ కూడా మరింత దూరం

అల్లు అర్జున్ కు కలిసొచ్చిన కాలం వేసవి. సమ్మర్ లో రిలీజైన ఆయన సినిమాలన్నీ బంపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. తాజా చిత్రం 'దువ్వాడ జగన్నాథమ్‌'ను కూడా ఈ సమ్మర్ లోనే విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు. కానీ ఇప్పుడా ప్లాన్ వర్కవుట్ అయ్యేలా కనిపించట్లేదు. దువ్వాడ జగన్నాథం సినిమా ఇంకో రెండు నెలలు వెనక్కి జరిగే అవకాశం ఉంది. ఇంతకీ ఎందుకు..

 

అల్లు అర్జున్ బ్రాహ్మణుడి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇటీవలే రిలీజైన పోస్టర్స్, టీజర్స్ సినిమా మీద అంచనాలు రెట్టింపు చేయగా.. చిత్ర యూనిట్ ఇప్పుడు అభిమానులకు ఓ షాక్ ఇచ్చింది.

 

ఇంకా 10 శాతం షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉన్న ఈ మూవీని.. సమ్మర్ రిలీజ్‌గా మే 19న విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత దిల్ రాజు నిర్ణయించాడు. కానీ, ఇప్పుడు సినిమా విడుదల వాయిదా పడబోతోందట. అదీ రోజులు కాదు నెలలపాటు. జూన్ 2 దాకా సినిమా రిలీజయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తి కాకపోవటం, తరువాత మహేష్ 23 సినిమా రిలీజ్ ఉండటంతో రెండు నెలల పాటు సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారట.

 

ఇదిలా ఉంటే.. వాయిదాకి కారణం చిత్ర కథానాయకుడు అల్లు అర్జునేనని మరో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ మేటరేంటంటే.. దుబాయ్‌లో ఇటీవల డీజే సినిమాకు సంబంధించిన పాట చిత్రీకరించారు. ఆ సందర్భంగా బన్నీకి స్కిన్ అలర్జీ వచ్చిందట. అందుకే అల్లు అర్జున్ ఇటీవల జరిగిన అల్లు రామలింగయ్య అవార్డు ఫంక్షన్‌కు మాస్క్‌ తో వచ్చాడు. అలా పాట చిత్రీకరణ సందర్భంగా వచ్చిన అలర్జీ కాస్తా.. ఇప్పుడు ఇంకా ఎక్కువైందట.

 

ముఖమంతా ఎర్రటి దద్దుర్లతో కందిపోయిందట. దీంతో డీజే షూటింగ్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ ఎఫెక్ట్ కాస్తా డీజే విడుదల తేదీపై పడింది. దీంతో అనుకున్న తేదీకి డీజే సినిమా విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. అలా బన్నీ ఫ్యాన్స్ ను నిరాశపరుస్తూ సినిమా విడుదల ఆలస్యమయ్యే పరిస్థితి తలెత్తింది.

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి